మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్

మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్

Phani CH

|

Updated on: Nov 18, 2024 | 12:54 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా.. ఇందులో భాగంగా శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో సభ్యుల మధ్య వాదోప వాదాలు మొదవలవ్వగా ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించిన ఘనత మాది అని తెలిపారు..

అంతే కాకుండా ముచ్చుమర్రి ఘటనలో బాధితురాలిని గుర్తించడానికి సమయం పట్టిందని గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. పైగా పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు తెలిపారు. అసలు దిశ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు అంటూ ప్రశ్నిచారు.. హోంమంత్రి వంగలపూడి అనిత. అయితే హోం మంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ వైసీపీ నినాదాలు చేసింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వారు సభకు వస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మంత్రి అనిత అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ అలెర్ట్.. మీ పాన్‌ కార్డ్‌ తో ఆధార్‌ లింక్‌ అయి ఉందా ??

ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??

చాలా ఏళ్లకు కనిపించి.. సడ్‌సర్‌ప్రైజ్‌ చేసిన తమ్ముడు హీరోయిన్