ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??
తెలుగునాట ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ. ఇక నెట్టింట.. ఆమె గురించే రచ్చ. సాధారణంగా అఘోరాలు.. జన జీవనంలోకి రారు. పబ్లిసిటీ కోరుకోరు. మరి ఈవిడెందుకు వచ్చింది? అసలు వాళ్ల లైఫ్ స్టైలే సెపరేట్ గా ఉంటుంది. భౌతిక సుఖాలను పూర్తిగా వదిలేస్తారు. మరి ఈ అఘోరీ ఎందుకు.. ఓ మామూలు మనిషిలా జీవిస్తున్నట్టుగా కనిపిస్తోంది? కారులో తిరుగుతోంది. ఖరీదైన సౌకర్యాలూ ఉన్నాయి. అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.
ఇప్పటివరకు అఘోరాల గురించి విన్నదానికి, చూసినదానికి.. ఇక్కడ ఈమె ప్రవర్తనకు అసలు ఎక్కడా పొంతనే కనిపించదు. పెట్రోల్ పోసుకుంటానంటుంది. ఆత్మహత్యకు చేసుకుంటానంటుంది. కారుతో నదిలోకి వెళ్లి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. ఆగ్రహంతో రగిలిపోతుంది. ఆవేదనతో కుంగిపోతుంది. అసలు.. అఘోరాలకు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? వాళ్ల జీవితంలో ఇన్ని యాక్షన్స్ సీన్స్ కు చోటుందా? ఈవిడను చూస్తే.. అఘోరీలు ఇలా ఉంటారా అన్న అనుమానం కూడా వస్తుంది. ఇంతకీ.. అఘోరీల జీవనవిధానం ఎలా ఉంటుంది? వారి రోజువారీ జీవితం ఎలా గడుస్తుంది? మరి ఈ అఘోరీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది. డీటైల్డ్ గా ఓ లుక్కేద్దాం. చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత ఇప్పుడో సెలబ్రెటీ. ఆమె వెళ్లినచోటల్లా తనను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. దీంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. దానికి ఆమె జీవనశైలి కూడా ఓ కారణం. నిజానికి అఘోరాలు.. కాలుతున్న శవాల మధ్యే ఉండడానికి ఇష్టపడతారు. వారు దైనందిక అవసరాలను తీర్చుకునేది కూడా అక్కడే. ఒళ్లంతా బూడిదతో, ఒంటి నిండా మనుషుల పుర్రెలతో కనిపిస్తారు. మృతదేహాలను తినడం, గంజాయి తాగడం.. స్మశానాల్లో సంచరించడం వీరికి నిత్యకృత్యం. నిజానికి వీరిపై మన సమాజంలో పవిత్రమైన భావనే ఉంది. అందుకే వారిని ప్రత్యేకంగా చూస్తారు. అఘోరా అన్న పేరు వెనుక అర్థం చూస్తే.. భయం లేని.. అని ఉంటుంది. కానీ వీరి వేషధారణ, జీవనశైలి చూస్తే.. ఒక్కోసారి వెన్నులో...
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

