రోహిత్ vs పాట్ కమిన్స్.. ఏ కెప్టెన్ ఇల్లు అత్యంత ఖరీదైనదో తెలుసా?

TV9 Telugu

14 November 2024

భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్లు ఇప్పటికే కసతరత్తులు మొదలుపెట్టాయి.

ఈ సిరీస్‌లో టీమిండియా కమాండ్ రోహిత్ శర్మ చేతిలో ఉంది. ఆస్ట్రేలియాకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో ఇద్దరూ సిరీస్ విజయంపై కన్నేశారు.

ప్రస్తుత కాలంలో అత్యంత ధనవంతులైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటగాళ్ల ఇళ్ల విలువ కూడా కోట్లలో ఉంటుంది.

రోహిత్ శర్మ విలాసవంతమైన అపార్ట్మెంట్ ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉంది. అతను తన భార్య రితికా సజ్దేహ్, కుమార్తె సమైరాతో అక్కడ నివసిస్తున్నాడు.

రోహిత్‌కి చెందిన ఈ ఇల్లు అహుజా టవర్స్‌లోని 29వ అంతస్తులో ఉంది. 2015లో రోహిత్ ఈ ఇంటిని కొనుగోలు చేశాడు. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర దాదాపు రూ.30 కోట్లు.

మరోవైపు, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇల్లు తూర్పు సిడ్నీలో ఉంది. ఈ లగ్జరీ హౌస్‌లో 5 బెడ్‌రూమ్‌లతో పాటు స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

పాట్ కమ్మిన్స్ ఈ విలాసవంతమైన ఇంటిని 2021 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఈ ఇంటి ధర దాదాపు 9.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.80 కోట్లు.

ఆస్ట్రేలియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో పాట్ కమిన్స్ ఒకరు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.