Nara Rohit: ‘కష్టకాలంలో అండగా నిలిచారు’.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హీరో నారా రోహిత్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నారా, నందమూరి ఫ్యామిలీలు విషాదంలో మునిగిపోయాయి. ఇక తండ్రి మరణంతో నారా రోహిత్ పూర్తిగా కుంగిపోయాడు.

Nara Rohit: 'కష్టకాలంలో అండగా నిలిచారు'.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హీరో నారా రోహిత్
Nara Rohit
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2024 | 6:29 PM

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారి పల్లెలో ముగిశాయి. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారా రామ్మూర్తి నాయుడికి కడసారి వీడ్కోలు పలికారు. ఇక తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు హీరో నారా రోహిత్. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. కాగా క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు నారా రోహిత్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘నా తండ్రిని కోల్పోయిన సమయంలో మీరు చూపిన ప్రేమ, మద్దతుమమ్నల్ని బాగా కదిలించాయి. మీ హృదయపూర్వక సందేశాలు, ఓదార్పునిచ్చే మాటలు మా కుటుంబానికి అపారమైన ధైర్యం, శక్తినిచ్చాయి’ అని నారా రోహిత్ ట్వీట్ చేశాడు.

ఇక ఇదే సందర్భంగా తన పెదనాన్న సీఎం చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, అన్న లోకేశ్, వదిన బ్రాహ్మిణిలకు నారా రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుడు. కష్ట సమయంలో తమ వెంటఉండి అండగా నిలిచారని, కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారని రోహిత్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ అభిమానులు, నెటిజన్లు నారా రోహిత్ కు ధైర్యం చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నారా రోహిత్ ట్వీట్..

అంతకు ముందు సోషల్ మీడియా వేదికగానే తన తండ్రితో అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకన్నారు నారా రోహిత్. ‘మీరొక ఫైటర్‌ నాన్న. మీరు నాకు ప్రేమించడాన్ని నేర్పించారు. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మీరే కారణం. మంచి కోసం పోరాడాలని నేర్పించారు. అలాగే.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారని.. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. తండ్రితో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి.  ఇక చివరిగా ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’  తండ్రిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు నారా రోహిత్.

తండ్రితో తన అనుబంధంపై..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు
ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు
ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!
ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!
మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది..
మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది..
అమరన్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
అమరన్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
'అమృత' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'అమృత' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..!
ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..!
ఫోన్ లాక్ బటన్ పాడైతే డిస్‌ప్లేను ఎలా ఆన్‌ చేయాలి? ఇదిగో ట్రిక్
ఫోన్ లాక్ బటన్ పాడైతే డిస్‌ప్లేను ఎలా ఆన్‌ చేయాలి? ఇదిగో ట్రిక్
యాదాద్రిలో దారుణం.. ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి
యాదాద్రిలో దారుణం.. ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి