పెళ్లి మండపం లోకి పాము వచ్చింది.. ఆ తర్వాత ఏమైంది ??
ఆలయంలోని కళ్యాణ మండపంలో వివాహం జరగుతోంది. అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇంతలో జనంలో అలికిడి మొదలైంది. ఏం జరిగిందా అని చూడగా అక్కడ గోడ పక్కగా ఓ భారీ కొండచిలువ పడుకొని ఉంది. అది చూసి పెళ్ళికొచ్చినవారంతా భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. కొందరు స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది. గోదావరి ఒడ్డున సుబ్రహ్మణ్య స్నాన ఘాట్‌లో శివాలయం ఉంది. ఆలయం పై అంతస్తులో ఓ కళ్యాణమండపం, వేదిక ఉన్నాయి. బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా గోడ ప్రక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా సుమారు 7 అడుగులు పొడవున్న ఉన్న ఓ కొండచిలువ కనిపించింది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న అందరూ పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడకు వచ్చారు. ఓ పక్క పెళ్లి భాజాలు,అందరూ గుమిగూడటంతో ఆ కొండచిలువ కాసేపు ఎటూ కదలకుండా ఉండిపోయింది. ఇటీవల వచ్చిన వరదలకు గోదావరి నుండి ఈ కొండచిలువ కొట్టుకు వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో అక్కడున్న ఆలయ సిబ్బంది అటవీ శాఖకు, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ కొండచిలువను బంధించి తీసుకెళ్లారు. దానిని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబులెన్స్‌లో భారీ పేలుడు.. లోపల నిండు గర్భిణీ..
తులసీ గబ్బార్డ్ నియామకం.. పాకిస్థాన్‌ను భయపెడుతుంటే.. భారత్‌ను సంతోషపెడుతోందా ??
Obesity: ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే.. మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది
ఏపీలో వర్షాలు !! ఎప్పటి వరకు అంటే ??
మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్