Kakimada: 100 మిల్లి గ్రాముల బంగారం.. 3 గంటల సమయం.. సూక్ష్మ శివలింగం ఆవిష్కృతం

Kakimada: 100 మిల్లి గ్రాముల బంగారం.. 3 గంటల సమయం.. సూక్ష్మ శివలింగం ఆవిష్కృతం

Pvv Satyanarayana

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 18, 2024 | 1:05 PM

ఈ స్వర్ణకారుడు ఏకకాలంలో తన భక్తిని, ప్రతిభను ప్రదర్శించాడు. 100 మిల్లి గ్రాములు బంగారంతో 3 గంటల సమయంలో సూక్ష్మ శివలింగం తయారుచేసి ఆశ్చర్యపరిచాడు. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన కోటేశ్వరరావు అనే స్వర్ణకారుడు 100 మిల్లి గ్రాములు బంగారంతో శివలింగాన్ని తయారు చేశాడు. కార్తీకమాసం సందర్భంగా ఈ సూక్ష్మ శివలింగ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తనకు మూడు గంటల సమయం పట్టిందని వివరించాడు. తనకున్న కళా నైపుణ్యానికి భక్తిని జోడించి శివలింగాన్ని తీర్చిదిద్దాడు. అతి చిన్న సైజులో, శివలింగం, దానిపై నాగ సర్పం ఎంతో నేర్పుగా తీర్చిదిద్ది తన కళానైపుణ్యాన్ని చాటుకున్నాడు.

ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. శివలింగం తయారీకి తనకు మూడు గంటల సమయం పట్టిందని తెలిపాడు. మూడు సంవత్సరాలుగా, తన మనసులో రూపుదిద్దుకున్న కల, ఈ ఏడాది కార్తీకమాసంలో నెరవేరిందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసాడు.స్వర్ణకార సంఘ సభ్యులు నాయకులు కోటేశ్వరరావు నైపుణ్యాన్ని కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Nov 18, 2024 01:03 PM