పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడిని చూసి.. ఆ వధువు ఏం చేసిందో చూడండి
వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ కీలక టర్నింగ్ పాయింట్. వివాహం కాగానే జీవన విధానమే మారిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇటీవల కాలంలో వివాహాల్లో జరిగే సరదా సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పెళ్లి రోజు ఎంతో సంతోషంగా, సంబరంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా వధూవరులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి పెళ్లి రోజున వరుడి రాకను కిటికీలో నుంచి చూస్తూ ఎంతో సంతోషపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన హ్యాండిల్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడు గుర్రం ఎక్కి ఊరేగింపు తో సహా కల్యాణ మండపానికి వస్తున్నాడు. అప్పటికే కల్యాణ మండపంలో ఉన్న వధువు కిటికీ దగ్గరకు వెళ్లి ఆ ఊరేగింపును సంతోషంగా వీక్షిస్తోంది. ఆ సమయంలో వరుడు, వధువును చూసి నవ్వాడు. దీంతో ఆ వధువు ఎంతో ఉత్సాహంగా వరుడికి చేతులు ఊపి హాయ్ చెప్పింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మందికి పైగా వీక్షించారు. 73 వేల మందికి పైగా లైక్ చేశారు. తమ స్పందనలను తెలియజేశారు. చాలా క్యూట్ వీడియో అని, వధువు ఎంత సంతోషంగా ఉందో అని, ఇది లవ్ మ్యారేజ్ అయ్యుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Diabetes: ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!
TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

