స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!
బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో లో మరోసారి సందడి చేశాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే గతంలో ఈ షోకు వచ్చిన బన్నీ మళ్లీ ఇప్పుడు సీజన్ లో అతిథిగా విచ్చేశాడు. అల్లు అర్జున్ తో పాటు అతని తల్లి నిర్మలమ్మ కూడా అన్ స్టాపబుల్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా తల్లీ కొడుకులిద్దరూ బాలయ్యతో బాగా ముచ్చట్లు పెట్టారు.
ఎవరికీ తెలియని చాలా విషయాలను పంచుకున్నారు. ఇక బాలయ్య కూడా రకరకాల ప్రశ్నలతో అల్లు అర్జున్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి షోను రక్తి కట్టించాడు బన్నీ. ఇక ఇదే షోకు మరో గెస్టుగా వచ్చిన నిర్మల అల్లు అర్జున్ చిన్నప్పటి విషయాలు పంచుకున్నారు. అలాగే అల్లు అరవింద్ గురించి, అల్లు రామలింగయ్య గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు బాలయ్య. స్నేహతో ప్రేమ గురించి అల్లు అర్జున్ మొదట మీకు చెప్పాడా? చెప్తే మీరు ఏమన్నారు అని నిర్మలమ్మను అడిగాడు బాలయ్య. దీనికి నిర్మలమ్మ.. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అమ్మ నేనొకటి చెప్పాలి. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ బన్నీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడన్నారు. అప్పటికే బన్నీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకు నిజంగా 100 శాతం ఆ అమ్మాయి మీద ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో అంటూ తాను కూడా చెప్పినట్టు నిర్మలమ్మ బాలయ్యతో చెప్పారు. ఇక అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి కొన్నాళ్ళు ప్రేమించి పెద్దలను ఒప్పించి 2011 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు అయాన్, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..
బన్నీ టీం మాస్టర్ ప్లాన్ !! అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్ బిహార్‌లో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

