AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ టీం మాస్టర్ ప్లాన్ !! అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో..

బన్నీ టీం మాస్టర్ ప్లాన్ !! అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో..

Phani CH
|

Updated on: Nov 17, 2024 | 4:30 PM

Share

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘పుష్ప 2’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం భారీ ప్రమోషన్‌ను ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే బిహార్ లోని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ వేడుక నిర్వహించనుంది.

అయితే పుష్ప2 టీం ట్రైలర్ రిలీజ్‌కు బీహార్ రాజధాని పాట్నాను ఎంచుకోవడం ఎందుకనే కొశ్చన్ ఇప్పుడు నెట్టింట వస్తోంది. అందుకు రీజన్‌ కూడా గట్టిగానే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఇక 2021లో విడుదలైన పుష్ప చిత్రం నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్‌లో పుష్ప సినిమాకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ఫిల్మ్ లవర్స్. పుష్ప రాజ్ అనే ఊర మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్‌ చేసుకున్నారు. అప్పట్లో పుష్ప ను ఇమిటేట్‌ చేస్తూ సోషల్ మీడియాలో చాలా రీల్స్ చేశారు. ఇటీవల పుష్ప 2 టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌కాగా దానిపై కూడా బిహారి యూతే ముందుగా సోషల్ మీడియాలో రీల్స్ చేసి షేర్ చేసింది. ఇక బిహార్‌ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ పుష్పకు మంచి క్రేజ్ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్‌ సందర్భంగా పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌ బాగా వినిపించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి లిరిక్స్‌ మార్చి తమ పార్టీ ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్‌, యూపీలో పుష్ప క్రేజ్‌ ఊహించని రేజ్ లో ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్‌ ఇండియా మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన పుష్ప 2 టీమ్ బిహార్‌ రాజధాని పాట్నాను తమ ట్రైలర్ రిలీజ్‌ కోసం ఎంచుకుంది. బీహారీస్‌ నుంచి వచ్చే రెస్పాన్స్‌తో .. త్రూ అవుట్ ఇండియా మొత్తం మార్మోగిపోవచ్చని థింక్ చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??

వామ్మో !! ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది… అందుకే !!

డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు

యముడు షార్ట్ బ్రేక్‌.. తీసుకున్నాడనుకుంటా !!

ఒరేయ్ ఎవర్రా మీరు ?? బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా ??

Follow Us