వామ్మో !! ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది… అందుకే !!
పొరుగుదేశం పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, వధువు మాత్రం ప్రాణాలతో బయటపడింది. గిల్గిట్-బాల్టిస్తాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 25 మందితో వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద అదుపుతప్పి నదిలోకి పడిపోయింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో వధువు ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె గిల్గిట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. అస్తోర్ నుంచి పంజాబ్లోని చక్వాల్ జిల్లాకు వెళ్తున్న పెళ్లి బస్సు గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని ఓ వంతెన పై నుంచి వెళ్తూ, సింధునదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ఉన్నవాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు
యముడు షార్ట్ బ్రేక్.. తీసుకున్నాడనుకుంటా !!
ఒరేయ్ ఎవర్రా మీరు ?? బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా ??
విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది ??
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

