విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది ??
వర్షాల కారణంగా వాసాలు కోల్పోయిన వన్యప్రాణులు ఇప్పటికీ జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. పుట్టల్లో ఉండాల్సిన పాములు ఇళ్లలోకి చొరబడి ఎక్కడపడితే అక్కడ చేరుతున్నాయి. వాహనాల్లో సైతం చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ అరుదైన నాగుపాము ఓ కారు యజమానికి చెమటలు పట్టించింది.
అవును, మనం సాధారణంగా అరుదుగా చూసే నాగుపాము శ్వేత నాగు.. ఇక గోధుమత్రాచు, అతిపెద్ద కోబ్రా, నల్లత్రాచు ఇలా రకరకాల పాములను మనం చూశాం. కానీ ఈ కారు యజమానికి కనిపించిన పాము మాత్రం గోల్డెన్ త్రాచుపాము. ఇది ఎక్కువగా ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే కనిపించే అత్యంత విషపూరితమైన నాగుపాము. చీకట్లో మెరుస్తూ కనిపించిన ఆ పామును చూసి ఉలిక్కిపడ్డాడు ఆ కారు యజమాని. విశాఖ యారాడ డాల్ఫిన్ హిల్స్ కొండపై నేవీ క్వార్టర్స్ లో ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు. వారిఓ ఓ ఉద్యోగి తన కారును షెడ్డులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతనికి షెడ్డులోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలించి చూశాడు. అక్కడ మెరుస్తూ బుసలు కొడుతూ ఓ నాగు పాము కనిపించింది. ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డాడు. అది బంగారు వర్ణంలో మెరుస్తూ ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా ఆ పామును బంధించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు