తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు

తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు

Phani CH

|

Updated on: Nov 16, 2024 | 9:39 PM

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓ ఈరోజు దలాల్‌ స్ట్రీట్‌లో ఎంట్రీ ఇచ్చింది. మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ షేర్లు నేడు మార్కెట్లో నమోదయ్యాయి. మార్కెట్‌ మొదలయ్యే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో రూ.420 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ.390తో పోలిస్తే 8 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి.

ఇక బీఎస్‌ఈలో రూ.412 రూపాయల వద్ద ప్రారంభమయ్యాయి. స్విగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నవంబర్‌ 8న ముగిసింది. ధరల శ్రేణిని రూ.371-390గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.6828 కోట్లు సమీకరించనుంది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ తొలి రోజు అంతంత మాత్రమే ఆదరణ నోచుకున్న స్విగ్గీ ఐపీఓ చివరి రోజున మాత్రం అనూహ్య స్పందన లభించింది. రూ.11,327 కోట్ల ఐపీఓ మొత్తం 3.599 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. 16 కోట్ల షేర్లకు గానూ 57.53 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల కోటా 6.02 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవ్వగా.. రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 1.14 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా 41 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఇప్పటికే రూ.5,085 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు