Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఎంత కాన్ఫిడెంట్‌గా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాడో ఈ వాచ్‌మెన్

AP News: ఎంత కాన్ఫిడెంట్‌గా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాడో ఈ వాచ్‌మెన్

J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 16, 2024 | 9:41 PM

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాడనంటారు. కానీ నంద్యాల జిల్లాలో డాక్టర్‌ కావాలనుకుని వాచ్‌మెన్‌ అయ్యాడనిపిస్తోంది...! ఇంతకీ ఆ ఘనుడు చేసిన ఘనకార్యమేంటో తెలుసుకుందాం పదండి...

పైన వీడియో  చూస్తున్నారా…! ఎంత కాన్ఫిడెంట్‌గా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నాడో…! కొంపదీసి డాక్టర్‌ అనుకునేరూ… అస్సల్‌ కానేకాదు హాస్పిటల్‌ గేట్‌ దగ్గరుండే వాచ్‌మెన్‌ ఇతగాడు. మరి ఈ రేంజ్‌ ట్రీట్‌మెంట్‌ ఎలా నేర్చుకున్నాడు…? ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందనంటే…!

డాక్టర్‌ లేకపోవడంతో… ఈ వాచ్‌మెనే ఇలా డాక్టర్‌ అయ్యాడన్నమాట. డాక్టర్ల నేర్పిన సబ్జెక్టో, చూసి నేర్చుకున్న ఎక్స్‌పీరియన్సో ఏమోగానీ… చిన్నలు, పెద్దలు ఆఖరికి గర్భిణీలకూ కూడా ఈ వాచ్‌మెన్‌ సాబే వైద్యం చేస్తున్నాడు. అంతేకాదు రక్తపరీక్షల దగ్గర్నుంచి… ఎక్స్‌రేల వరకూ దగ్గరుండి చూస్తాడట. నంద్యాల జిల్లా డోన్‌ మండలం కొత్తబురుజు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో బయటపడింది ఈ వాచ్‌మెన్‌ టాలెంట్.

డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు విధులకు హాజరుకావకపోవడంతో వాచ్‌మెన్‌ డాక్టర్‌ అవతారమెత్తాడు. ఏమాత్రం టెన్షన్‌ లేకుండా వైద్యం చేస్తూ పేషెంట్లను టెన్షన్‌కు గురిచేస్తున్నాడు. ఇలా ఒకపూటో, ఒకరోజో కాదు… చాలారోజులగా ఇక్కడ ఇదే తంతు నడుస్తోందంటున్నారు గ్రామస్తులు. ఆస్పత్రికి వెళ్లాలంటేనే వణికిపోవాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో వేరే గత్యంతరం లేక వాచ్‌మెన్‌తోనే వైద్యం చేయించుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి… చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై టీవీ9 లో వార్తలు ప్రసారం కావడంతో ప్రభుత్వ స్పందించింది. విచారణకు ఆదేశించింది. నిజమని తేలితే స్టాఫ్ మొత్తాన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించింది.  దీంతో కలెక్టర్, ఆర్డీవో సంబంధిత ఆసుపత్రికి వెళ్లి విచారణ చేస్తున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Nov 16, 2024 09:39 PM