కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటేస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఇందులో సత్య అక్కల, సత్యరాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ వేదికగా జీబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు .. 2024 హనుమాన్ మూవీతో శుభారంభం అయ్యిందని అన్నారు. అలాగే ఓ అభిమానిని సరదాగా ఆటపట్టిస్తూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంతో మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 హనుమాన్ సినిమాతో శుభారంభం అయ్యింది. తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా మూవీ అయిపోయింది. చిన్న సినిమాలు కమిటీ కుర్రోళ్లు, టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2 ఇలా వరుసగా హిట్స్ వచ్చాయి. మొన్న దీపావళీకి వచ్చిన అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

