డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు

డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు

Phani CH

|

Updated on: Nov 17, 2024 | 11:27 AM

ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేశాడో ఆర్టీసీ బస్ డ్రైవర్. అతడు దొంగతనం చేస్తుండగా ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో ఆ డ్రైవర్ ఉద్యోగం ఊడిపోయింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వస్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిందీ ఘటన.

ఆర్టీసీలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు బస్సులో తమ లగేజీ మర్చిపోతే దానిని బస్సు డిపోలో అప్పగిస్తారు. వారు ప్రయాణికుడి వివరాలు కనుక్కుని అందజేస్తారు. అయితే, ఈ బస్సు డ్రైవర్ మాత్రం ఆ పనిచేయకుండా అందులోని బంగారు నగలను కాజేశాడు. అయితే ఈ తతంగాన్ని ఓ ప్రయాణీకుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో బండారం బయటపడింది. డ్రైవర్‌ను నిలదీయగా అది కిందపడిపోయిందని, అందుకే తీశానని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యముడు షార్ట్ బ్రేక్‌.. తీసుకున్నాడనుకుంటా !!

ఒరేయ్ ఎవర్రా మీరు ?? బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా ??

విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది ??

కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు

తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు