కోహ్లి ఫిట్‌నెస్ రహస్యం ఏంటని అంతా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కోహ్లీ ముఖ్యంగా వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నాడు.
విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై చాలా శ్రమించాడు. అతను శాకాహారి, కాబట్టి అతను తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
విరాట్ కోహ్లీ ఎప్పుడూ చక్కెర, గ్లూటెన్ ఫుడ్స్ తినడు. అలాగే పాల ఉత్పత్తులను నివారించేందుకు ప్రయత్నిస్తుంటాడు. దీంతో కోహ్లీ ఫిట్‌గా ఉంటున్నాడు.
మీడియా కథనాల ప్రకారం, విరాట్ కోహ్లీ గ్లూటెన్‌ను నివారించడానికి గోధుమ రొట్టె తినడంట. గ్లూటెన్ గోధుమ రొట్టెలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్.
గ్లూటెన్ కారణంగా శరీరం కొవ్వు రహితంగా మారదని నిపుణులు చెబుతున్నారు. అందుకే విరాట్ కోహ్లీ గోధుమతో చేసిన పదార్థాలను తీసుకోడంట. కోహ్లీ ఎప్పుడూ ఫుల్ మీల్ తినడు.
విరాట్ కోహ్లి ఆహారంలో ఉడికించిన కూరగాయలు మంచి పరిమాణంలో ఉంటాయి. మసాలాలు కూడా ఎక్కువగా తినడు. ఉప్పు, మిరియాలు, నిమ్మకాయ మాత్రమే ఉపయోగిస్తాడు.
విరాట్ కోహ్లీకి రాజ్మా, లోబియా అంటే చాలా ఇష్టం. ఇది కాకుండా, అతను ఆలివ్ నూనెతో చేసిన సలాడ్‌ను కూడా ఇష్టపడతాడు.