Telangana: ఇక్కడ అన్నీ డబుల్.. ఓటర్లుగా రికార్డ్ లోకి ఎక్కబోతున్న ఆ గ్రామాల ప్రజలు

రెండు రాష్ట్రాలు.. రెండేసి ఓటర్ కార్డులు. రెండేసి రేషన్ కార్డులు.. రెండు వైపుల‌ నుంచి అందే సంక్షేమ పథకాలు. రెండేసి స్కూళ్లు.. రెండేసి పీహెచ్‌సీలు. ఆ గ్రామాల్లో అన్నీ డబుల్‌ బొనాంజా ఆఫర్లే.. అయినా ఆ గ్రామస్తుల జీవితాల్లో ఎన్నో వ్యాధులు.. ఆ స్పెషల్ గ్రామం గురించి తెలుసుకుందాం..

Telangana: ఇక్కడ అన్నీ డబుల్.. ఓటర్లుగా రికార్డ్ లోకి ఎక్కబోతున్న ఆ గ్రామాల ప్రజలు
Maharashtra Telangana Border
Follow us
Naresh Gollana

| Edited By: Surya Kala

Updated on: Nov 18, 2024 | 6:32 PM

పరందోళి… తెలంగాణ -మహారాష్ట్ర  సరిహద్దులోని  గ్రామం.  పల్లె చిన్నది.. కానీ  ఈ  పల్లె వాసుల  బాధ మాత్రం  పెద్దది. వన్‌ నేషన్‌ ..వన్‌ ఎలక్షన్‌ మాటేమో కానీ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో  పరందోళి సహా 12 గ్రామాల హిస్టరీ మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈ గట్టున ఓటు.. ఆ గట్టున ఓటు. ఎలక్షన్స్‌ వచ్చాయంటే 12 గ్రామాల్లో ఇక జోరుగా ప్రచారమే. ఒక్కమాటలో  చెప్పాలంటే వీళ్లది ఒక ఊరు.. రెండు రాష్టాల కథ. ఎన్నాళ్లుగానో  వీళ్లని వీడని వ్యథ. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఓటేశారు.. ఇప్పుడు మహారాష్ట్రలో  ఓటు వేయబోతున్నారు. అక్కడా ఇక్కడా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు వుంది. కానీ ఏ రాష్ట్రం నుంచి కనీస సాయం అందడంలేదనేది మరో 12 గ్రామాల గుండెచప్పుడు. గత 40 ఏళ్లుగా 12 గ్రామాలది అంతులేని వ్యథ.

ఓవైపు తెలంగాణ  బోర్డులు కన్పిస్తాయి. అలాగే మహారాష్ట్ర బోర్డులు కూడా. స్కూళ్లు.. ఆఫీసులు ఇలా డబుల్‌ డబుల్‌. మరో విశేషం ఏంటంటే 12 గ్రామాల్లో ప్రతీ ఊరికి ఇద్దరు సర్పంచ్‌లు ఉంటారు. ఇక  రేషన్‌..పెన్షన్‌ అన్నీ డబల్‌ డబుల్‌. స్కూళ్లు ..దవాఖానాలు కూడా అంతే. అంగట్లో అన్నీ  వుండి ఏంలాభం.. సరిహద్దులో ఉండడమే తమకు శనిలా మారిందంటున్నారు జనం. రేషన్‌.. పెన్షన్‌తో  ఏదో బతుకుతున్నాం అంటే బతుకున్నాం. కానీ రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి కూడా తమ భవిష్యత్‌కు భరోసాలేదనేది 12 గ్రామాల ప్రజల ఆవేదన.

రెండు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నా సరే తమ బతుకు రెంటికి చెడ్డగా రేవడిగా మారిందనేది స్థానికుల ఆవేదన. ఆందోళన. ఈ 12 గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  చేరాయి. భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు దగ్గరగా ఉన్నాయంటూ మహారాష్ట్ర పావులు కదిపింది. 1987లో 12 గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చుకుంది. అలా మొదలైన వివాదం కోర్టుకు చేరింది. కేకే నాయుడు కమిషన్‌ సహా హైకోర్టు కూడా ఈ 12 గ్రామాలు ఉమ్మడి ఏపీ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే  సరిహద్దు వివాదం అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేసు పెండింగ్ లోకి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 12 గ్రామాల్లో వివిధ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే..మరో వైపు అవే గ్రామాల్లో తెలంగాణ అధికారులు కుల గణన సర్వే చేపట్టారు. పెన్షన్‌ -రేషన్‌ డబుల్‌  ధమాకానే. కానీ 40 ఏళ్లుగా ఈ 12 గ్రామాల ప్రజలు పడుతోన్న టెన్షన్‌ అంతా ఇంతా కాదు. భూములున్నాయి. కానీ  అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఏ రాష్ట్రం కూడా తమకు పట్టాలు ఇవ్వడంలేదని వాపోతున్నారు 12 గ్రామాల ప్రజలు.  ఏ వూరు అంటే చెప్పొచ్చు. ఏ రాష్ట్రం అని అడిగితే ఇటు తెలంగాణ అని చెప్పలేరు. అటు మహారాష్ట్ర అని చెప్పలేరు. ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడే మాత్రం రాజకీయ నేతలు తమ దగ్గరకు వస్తారు. కానీ ఆ తరువాత ఎవరూ తమ గోడును పట్టించుకోరని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. గుండె నిండా బాధ వున్నా సరే ఓటు వేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తమ హక్కులకు దిక్కేవరనే ఆవేదనను భరిస్తూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మళ్లీ సిద్ధమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు
ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు
ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!
ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!
మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది..
మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది..
అమరన్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
అమరన్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
'అమృత' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'అమృత' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..!
ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..!
ఫోన్ లాక్ బటన్ పాడైతే డిస్‌ప్లేను ఎలా ఆన్‌ చేయాలి? ఇదిగో ట్రిక్
ఫోన్ లాక్ బటన్ పాడైతే డిస్‌ప్లేను ఎలా ఆన్‌ చేయాలి? ఇదిగో ట్రిక్
యాదాద్రిలో దారుణం.. ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి
యాదాద్రిలో దారుణం.. ఆకతాయి వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి