Brahmamudi, December 26th Episode: స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
నగలు కొనుక్కోవడానికి తనకు కావ్య చెక్ ఇచ్చిందని స్వప్న చెప్పడంతో.. రుద్రాణి, ధాన్యలక్ష్మిలు రెచ్చిపోతారు. ఇంట్లో రాద్దాంతం సృష్టిస్తారు. ఆఫీస్ నుంచి కావ్య రాగానే నిలదీస్తారు. సమాధానం చెప్పాలని సుభాష్ కూడా అంటాడు. దీంతో రాజ్ రంగంలోకి దిగుతాడు. అసలు నిజం బయట పెడతాడు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మీరు తినను అంటే వేస్ట్ చేయడం ఎందుకు అని ముష్టి వాళ్లకు వేసేశానని శాంతా అంటుంది. దీంతో మళ్లీ వంట చేయమని అంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మిలు. కావ్య అమ్మ గారికి ఫోన్ చేసి కనుక్కుని చెప్పమని శాంతా అంటుంది. అప్పుడే స్వప్న వస్తుంది. హలో ఆంటీస్ చూశారా.. అని అంటుంది. చూశాం నీ ఓవరాక్షన్ అని రుద్రాణి అంటే.. నాలో ఒక కొత్త చేంజ్ వచ్చింది అదేంటో చెప్పుకోండి చూద్దామని స్పప్న అంటుంది. ఏయ్ మాకు ఈ పజిల్స్ ఎందుకు కానీ.. అసలు విషయం చెప్పమని ధాన్యలక్ష్మి అంటుంది. నన్ను చూస్తుంటే మీకేం అనిపించడం లేదా? ఇంతకీ నా మెడలో మెరిసి పోతుంది ఎలా ఉందో చెప్పలేదని స్వప్న అంటే.. కొత్తవా అని ధాన్యలక్ష్మి అంటే.. హా.. ఇప్పుడే షాపు నుంచి ఇంటికి వస్తున్నా అని స్వప్న అంటే.. అవి ఏ రోల్డ్ గోల్డ్ అయి ఉంటాయిలే అని రుద్రాణి అంటే.. కాదు కాదు.. ప్యూర్ 916 కేడిఎం గోల్డ్.. పది లక్షలు అని అంటుంది. ఏయ్ అంత డబ్బు నీకు ఎక్కడిదే అని రుద్రాణి అడిగితే.. మా చెల్లి ఇచ్చిందని స్వప్న అంటుంది. కావ్య ఇచ్చిందా అని షాక్ అవుతారు. అదే ఎలా ఇచ్చారని షాక్ అవుతున్నారని శాంతా అంటే.. తన చేతులతో చెక్ ఇచ్చిందని స్వప్న అంటుంది.
నెక్లెస్ ఎందుకు కొనిచ్చింది..
అనవసరంగా ఖర్చు చేస్తున్నామని ఇంట్లో సింగ్ కర్రీ వండుతూ నీకు పది లక్షలు ఇచ్చిందా? అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఫైర్ అవుతారు. ఇక కావాలనే స్వప్న ఓవరాక్షన్ చేస్తుంది. వెంటనే అక్కా అంటూ ధాన్యలక్ష్మి అరుస్తుంది. దీంతో అపర్ణ ఉలిక్కి పడుతుంది. ఏంటి ధాన్యలక్ష్మి అలా అరిచావు అని అపర్ణ అడిగితే.. మాకు న్యాయం చేయాలి అని అడుగుతారు. మళ్లీ ఏమైందని సుభాష్ అడుగుతాడు. సమన్యాయం అని మాట్లాడే కావ్య.. సొంత అక్కకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయం అంటూ వ్యవహరిస్తుంది. ఇంట్లో రోజూ ఒకటే టిఫిన్ తినాలి, కర్రీ తినాలని రూల్స్ పాస్ చేస్తూ.. తన అక్కకు మాత్రం పది లక్షలు ఖర్చు పెట్టి గోల్డ్ నెక్లెస్ కొని ఇచ్చింది. నిజంగా ఇంటిని కాపాడే మనిషే అయితే.. వృథా ఖర్చులు పెట్టకూడదు అనే ఉద్దేశం ఉంటే.. నెక్లెస్ ఎలా కొనిచ్చింది? ఇవి నీకు నిజంగానే తెలియకుండా జరుగుతున్నాయా అని ధాన్యలక్ష్మి, రుద్రాణిలు రెచ్చిపోతారు.
బానిసలుగా బతకడం కుదరదు..
ధాన్యలక్ష్మి అంటూ అపర్ణ అరుస్తుంది. కోడల్ని అనేసరికి కోపం వచ్చిందా అక్క? మరి మమ్మల్ని అనేసరికి కోపం రాదా? ఇవన్నీ చూస్తూ కూడా మీరు మౌనంగా ఉంటే వీటన్నింటి వెనుక మీరు ఉన్నారనే అర్థం వస్తుంది. ఇంకా తెలియకుండా కావ్య వాళ్ల పుట్టింటికి ఎంతెంత చేర వేస్తుందో ఎవరికి తెలుసు? అని రుద్రాణి అంటుంది. చాలు ఆపండి నిజా నిజాలు తెలియకుండా మాట్లాడకండి. కావ్య ఎందుకు ఇచ్చిందో తెలుసుకోవాలని సుభాష్ అంటే.. నిజం తెలుసుకునే మాట్లాడుతున్నాం బావ గారు. స్వప్నే తన నోటితే కావ్యే చెక్ ఇచ్చిందని చెప్పింది. ఈ ఇంట్లో మీకు ఎంత అధికారం ఉందో.. మాకు అంతే అధికారం ఉంది. బానిసలుగా బతకడం కుదరదని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అని సుభాష్ అంటే.. ఏం జరగాలో అదే జరుగుతుంది మీరు కంగారు పడకండి అని అపర్ణ అంటే.. మరి కావ్య ఎందుకు అలా చేయాలి? డబ్బులు లేవని.. స్వప్నకు ఎందుకు ఇవ్వాలి? అని సుభాష్ అంటే.. కావ్య తప్పు చేయదని మీకూ తెలుసు.. ముందు తనని రానివ్వండి అడిగి తెలుసుకుందామని అపర్ణ అంటుంది.
మీ అక్కకి గోల్డ్ నెక్లెస్ ఎందుకు కొన్నావు?
ఇక కావ్య, రాజ్‌లు ఇంటికి వస్తారు. వాళ్లకే కోసమే ఎదురు చూస్తున్న ధాన్యలక్ష్మి, రుద్రాణిలు.. వచ్చావా నీ కోసమే ఎదురు చూస్తున్నాం అని అంటారు. ఇక ఇంట్లోని వాళ్లందరూ బయటకు వస్తారు. మా కార్డ్స్ బ్లాక్ చేశావా అని రుద్రాణి అంటే. ఆ చేశాను అని కావ్య అంటే.. మావి అనవసర ఖర్చులు అంటా.. మరి మీ ఇంటికి ఎన్ని లక్షలు వెళ్తున్నాయి? ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని రుద్రాణి అంటే.. అత్తింటి సొమ్మును పుట్టింటికి చేరవేసే చీప్ క్యారెక్టర్ కాదు నాది అంటూ కావ్య అంటుంది. మరి నీ అక్కకు ఎందుకు గోల్డ్ నెక్లెస్ ఎందుకు కొన్నావు? అని ధాన్యలక్ష్మి, రుద్రాణిలు నిలదీస్తారు. ఇక స్వప్నను పిలుస్తుంది కావ్య. ఏంటి నెక్లెస్ గురించి పంచాయితీ పెట్టారా.. వాళ్లను వదిలేసి నా నెక్లెస్ ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది స్వప్న. ఈ నెక్లెస్ ఎవర్ని అడిగి కొన్నావు అక్కా? అని కావ్య అడిగితే.. ఎవర్నో ఎందుకు అడగాలే? అని స్వప్న అంటుంది. నీ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కావ్య అడిగితే.. నువ్వే కదా చెక్ ఇచ్చావు అని స్వప్న అంటుంది.
రెచ్చిపోయిన రుద్రాణి, ధాన్యలక్ష్మిలు..
దీంతో ధాన్యలక్ష్మి, రుద్రాణిలు రెచ్చిపోతారు. అక్కా నేను నీకు చెక్ ఇచ్చి గోల్డ్ నెక్లెస్ కొనుక్కోమని చెప్పానా? ఎవర్ని అడిగి కొనుక్కున్నావు? ఆ చెక్‌ని అలా వాడుకోమని నేను చెప్పానా అని కావ్య అడుగుతుంది. ఆహా ఏం నాటకాలు ఆడుతున్నారు? అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ధాన్యలక్ష్మి, రుద్రాణిలు అంటారు. అత్తయ్యా, మావయ్య, అమ్మమ్మా ఇందుకే నాకు ఈ ముళ్ల కిరీటం వద్దు అని చెప్పాను. కానీ మీరంతా కలిసి తాతయ్య నిర్ణయం అని చెప్పి నా చేతులకు సంకెళ్లు వేశారు. ఎందుకు ఈ మాటలు పడాలి? తాళాలు నా చేతిలో ఉండటం మీకు ఎవరికీ నచ్చడం లేదని కావ్య బాధ పడుతుంది. కావ్యా అందరి కార్డులు బ్లాక్ చేసి స్వప్నను నెక్లెస్ కొనుక్కోమని చెక్ ఇచ్చారు అంటున్నారు. ఈ విషయంలో వాళ్లు ప్రశ్నించడం కూడా న్యాయం కదమ్మా అని సుభాష్ అడుగుతాడు. నా భార్య ఎందుకు చెప్పాలి డాడ్? చెప్పు స్వప్న కళావతి నీకు చెక్ ఇచ్చినప్పుడు నీకు ఏమని చెప్పింది? నేను కూడా అక్కడే ఉన్నాను. నీ చెల్లి మీద ఇంత నిందలు పడుతుంటే నువ్వు మాట్లాడాలి అని రాజ్ అడుగుతాడు. ఇంట్లో ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వమని ఇచ్చింది. కానీ ఆ అవసరం రాలేదు. అందుకే నేను నెక్లెస్ కొనుక్కున్నానని స్వప్న చెబుతుంది.
కావ్యకు నగలు ఇచ్చేసిన స్వప్న..
విన్నారు కదా అందరూ.. మీ ప్రశ్నలకు సమాధానం దొరికిందా? అని రాజ్ అంటాడు. అక్కా ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా? తాతయ్య ఆస్పత్రిలో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి పని చేయడం మంచి పద్దతేనా? నీకు ఉన్న నగలు సరిపోవా? ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి కొనడం అవసరమా? నీకు తాతయ్య ప్రాపర్టీ రాసి ఇచ్చారు కదా అందులోంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా.. ఏదన్నా కావాలంటే నీ భర్తను అడుగు. అంతే కానీ దుగ్గిరాల వారి ఇంటి డబ్బును అడక్కుండా ఖర్చు పెట్టే అధికారం నీకు లేదని కావ్య అంటుంది. చాలు ఆపు.. ఈ నెక్లెస్ కొనడం వల్లే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఈ నెక్లెసే వద్దు. ఈ నెక్లెస్ తీసుకుని అమ్మేసుకుని ఆ డబ్బు తీసుకో అని నగలు ఇచ్చేసి వెళ్తుంది స్వప్న. ఇదంతా పెద్ద నాటకం అని ధాన్యలక్ష్మి అంటే.. మీరు ఇంక మారరా.. నా కొడుకే సాక్ష్యం చెప్పినా తప్పు పట్టడం ఆపరా అంటూ అపర్ణ సీరియస్ అవుతుంది. మా కార్డులు బ్లాక్ చేయించడం అర్థం ఏంటి? అని ధాన్యలక్ష్మి అంటుంది. నేను ఇంతే.. ఇప్పుడు చెబుతున్నాను ఇక నుంచి నేను ఇంతే. కానీ ఇక నుంచి నేను ఎవరికీ సమాధానం చెప్పను. ఎవరికీ సమాధానం ఇవ్వను. లక్షలకు లక్షలు దుబారా చేసే రోజులు పోయాయని కావ్య అంటుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..