Telangana: ముగ్గురి ప్రాణాలు తీసిన ఫ్లెక్సీలు.. ఇద్దరు కరెంట్ షాక్‌తో చనిపోతే, మరొకరు…!

రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసుకువెళ్లడానికి వచ్చిన ఇద్దరు యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లెక్సీ తొలగిస్తుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను చూసేందుకు బైక్‌పై వేగంగా వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: ముగ్గురి ప్రాణాలు తీసిన ఫ్లెక్సీలు.. ఇద్దరు కరెంట్ షాక్‌తో చనిపోతే, మరొకరు...!
Electrocution
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Dec 26, 2024 | 11:38 AM

ఫ్లెక్సీల కోసం వెళ్లి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు ఇద్దరు యువకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలోనే దారి పొడువున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. సీఎం టూర్ అయిపోగానే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీల కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రాణాలు పొగొట్టుకున్నారు.

మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ శివారులో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం టూరు పూర్తి కావడంతో ఫ్లెక్సీలు తొలగించే క్రమంలోనే అక్కెం నవీన్, పసువవుల ప్రసాద్ అనే వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. రెండు పెద్ద ఫ్లెక్సీలను తీసుకోవడానికి రాత్రి పూట వెళ్లారు. అయితే ఆ ఫ్లెక్సీలు కరెంట్ తీగలకు తగిలి ఉండడంతో ఆ విషయాన్ని గమనించని ఆ ఇద్దరు ఫ్లెక్సీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కాగా ఫ్లెక్సీ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తులు తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా, విగత జీవులుగా కనిపించారు. ఆ ఇద్దరి మృతితో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయారు. ఉదయం నుండి గ్రామంలో అందరితో కలిసి మెలిసి తిరిగిన నవీన్, ప్రసాద్ లు ఫ్లెక్సీ కోసం వెళ్లి హఠాత్తుగా మృతి చెందడంతో కిష్టాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉండగా వీరి మృతి వార్తను తెలుసుకోని అక్కడికి పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. అయితే ఓ వ్యక్తి మద్యం మత్తులో బైక్ నడుపుతూ అక్కడ వచ్చాడు. బైక్‌తో వేగంగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను డీ కొట్టి.. కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే