ఆయనతో అక్కడ కలిసుండను.. ట్రంప్ భార్య సంచలన నిర్ణయం !!

ఆయనతో అక్కడ కలిసుండను.. ట్రంప్ భార్య సంచలన నిర్ణయం !!

Phani CH

|

Updated on: Nov 18, 2024 | 3:59 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. వచ్చే ఏడాది జనవరిలో ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. దీంతో ఆయన సతీమణి మెలానియా అమెరికా ప్రథమ మహిళగా హోదా అందుకోనున్నారు. అయితే, ట్రంప్‌ పదవీకాలంలో పూర్తిస్థాయిలో ఆమె వైట్‌హౌస్‌లో ఉండేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.

అప్పుడప్పుడు మాత్రమే ఆమె వైట్‌ హైస్‌కి వస్తారని కథనాలు వెలువడుతున్నాయి. మెలానియా ఎక్కువ సమయం ఫ్లోరిడా, న్యూయార్క్‌లోనే గడిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘‘మెలానియా ట్రంప్‌ అమెరికా ప్రథమ మహిళగా ఉంటారు. అయితే, అది కేవలం ప్రాధాన్యాలకు తగ్గట్లుగానే మాత్రమేనని, పెద్ద పెద్ద ఈవెంట్లు, కార్యక్రమాలకు అధ్యక్షుడితో కలిసి హాజరవుతారని ట్రంప్‌ ఎస్టేట్‌ మార లాగో అంతర్గత వర్గాలు వెల్లడించాయి. ఆమె ‘పార్ట్‌టైమ్‌ ఫస్ట్‌ లేడీ గా.. పూర్తి సమయం ఓ తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2020లో ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత మెలానియా ఫ్లోరిడాకు మారారు. గత నాలుగేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న ఆమె.. ఇప్పుడు కూడా ఎక్కువ కాలం అక్కడే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక, ఆమె కుమారుడు బారన్‌ ట్రంప్‌ ప్రస్తుతం న్యూయార్క్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. దీంతో ఆమె న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌లో కొంతకాలం ఉంటారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వార్తలు నిజమైతే ప్రథమ మహిళ శ్వేతసౌధంలోనే ఉండే ఆనవాయితీని మెలానియా బ్రేక్‌ చేసినవారవుతారు. ఇక, గత రాత్రి ఓవల్‌ ఆఫీసులో ప్రస్తుత తొలి మహిళ జిల్ బైడెన్‌ ఇచ్చిన ఫస్ట్‌ లేడీ టీ పార్టీకి కూడా ఆమె హాజరుకాలేదు. దీనికి హాజరైన ట్రంప్‌.. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి మండపం లోకి పాము వచ్చింది.. ఆ తర్వాత ఏమైంది ??

అంబులెన్స్‌లో భారీ పేలుడు.. లోపల నిండు గర్భిణీ..

తులసీ గబ్బార్డ్‌ నియామకం.. పాకిస్థాన్‌ను భయపెడుతుంటే.. భారత్‌ను సంతోషపెడుతోందా ??

Obesity: ఇంటర్నెట్‌ స్పీడ్ పెరిగితే.. మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది

ఏపీలో వర్షాలు !! ఎప్పటి వరకు అంటే ??