World Cup 2023 Semis: ఇండియా ఇన్.. బంగ్లాదేశ్ ఔట్.. సెమీ-ఫైనల్ రేసు ఎలా ఉందంటే?
World Cup 2023 Semis: ప్రపంచ కప్ 2023 రౌండ్ రాబిన్ దశలో 45 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే 343 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లలో మూడింట రెండు వంతుల తర్వాత, కేవలం ఒక జట్టు అంటే టీమిండియా మాత్రమే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. మిగిలిన జట్ల పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది.

World Cup 2023 Semifinal Race: ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. గత మూడు మ్యాచ్‌ల ఫలితాలు రెండు జట్ల స్థానాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ సెమీ-ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. భారత జట్టు ఫైనల్-4కి చేరుకుంది. సెమీ-ఫైనల్ రేసులో మిగిలిన 8 జట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్: వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే ఓ ఆశ మిగిలి ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 5 ఓడిపోయింది. సెమీ-ఫైనల్స్‌లో తన చివరి మూడు మ్యాచ్‌లను పెద్ద తేడాతో గెలిచి, ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా వస్తే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.
శ్రీలంక: లంక జట్టు పరిస్థితి ఇంగ్లండ్ తరహాలోనే ఉంది. ఈ ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. రెండు విజయాలు తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంక సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే, అది తన మిగిలిన రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలు నిర్దిష్ట సమీకరణం ప్రకారం రావాల్సి ఉంటుంది.
నెదర్లాండ్స్: దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకోవాలనే ఆశలను నెదర్లాండ్స్ సజీవంగా ఉంచుకుంది. కానీ, నేడు జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై చిత్తుగా ఓడిపోయింది. 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. నెదర్లాండ్స్ జట్టు ఇక్కచి నుంచి అన్ని మ్యాచ్‌లు గెలిస్తే సెమీఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఇతర జట్ల మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడవలసి ఉంటుంది.
ఆఫ్ఘనిస్థాన్: ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ సెమీఫైనల్ చేరేందుకు సువర్ణావకాశం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4గెలిచింది. మిగిలిన 2 మ్యాచ్‌లను గెలిస్తే.. సెమీ-ఫైనల్ ప్రవేశం ఖాయం. ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడితే.. చివరి 4కి వెళ్లే అవకాశాల నుంచి తప్పుకున్నట్లే.
పాకిస్తాన్: 2023 ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన తర్వాత, పాకిస్తాన్ జట్టు సెమీ-ఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే గత మూడు మ్యాచ్‌ల ఫలితాలు ఆ జట్టుకు కొంత ఆశను ఇచ్చాయి. బంగ్లాదేశ్‌పై గెలుపొందడం, దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓటమి, శ్రీలంకపై భారత్ విజయం పాకిస్థాన్ మార్గాన్ని కొద్దిగా సులభతరం చేశాయి. ఇక్కడి నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై పాకిస్థాన్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే సెమీఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఇతర జట్ల కొన్ని మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
న్యూజిలాండ్: ప్రపంచ కప్ 2023లో మొదటి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ టిక్కెట్ దాదాపుగా ఖాయం అయినట్లు భావించారు. అయితే గత మూడు మ్యాచ్‌లలో ఓటమి కివీ జట్టుకు మార్గాన్ని చాలా కష్టతరం చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఓడిపోతే.. ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి వస్తుంది.
ఆస్ట్రేలియా: కంగారూ జట్టు సెమీఫైనల్ ఆడటం సులువుగా కనిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌లుగా వరుసగా విజయాలు సాధిస్తోంది. ఇక్కడ నుంచి మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిస్తే, టిక్కెట్ ఖాయం. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా, సులభంగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా ఉంటాయని ఆశించాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




