AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: 2వ టెస్ట్ కోసం స్వ్కాడ్ ప్రకటనతో ఆ ముగ్గురికి బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. రిటైర్మెంట్ పక్కా..

Team India: టీమ్ ఇండియాలో పోటీ నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా ముగ్గురు స్టార్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగింపు అంచుకు చేరుకుంది. ప్రతి క్రికెటర్ క్రికెట్ మూడు ఫార్మాట్లలో తన దేశం కోసం ఆడాలని కోరుకుంటాడు. కానీ, చాలా తక్కువ మంది ఆటగాళ్లు అలా చేయగలరు. ఇలాంటి లిస్టులో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరికి ఒక ఫార్మాట్‌లో కూడా తమ స్థానాన్ని కాపాడుకోవడం సాధ్యం కాలేదు.

IND vs BAN: 2వ టెస్ట్ కోసం స్వ్కాడ్ ప్రకటనతో ఆ ముగ్గురికి బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. రిటైర్మెంట్ పక్కా..
Team India Wtc Final
Venkata Chari
|

Updated on: Sep 22, 2024 | 5:30 PM

Share

Team India: టీమ్ ఇండియాలో పోటీ నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా ముగ్గురు స్టార్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగింపు అంచుకు చేరుకుంది. ప్రతి క్రికెటర్ క్రికెట్ మూడు ఫార్మాట్లలో తన దేశం కోసం ఆడాలని కోరుకుంటాడు. కానీ, చాలా తక్కువ మంది ఆటగాళ్లు అలా చేయగలరు. ఇలాంటి లిస్టులో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరికి ఒక ఫార్మాట్‌లో కూడా తమ స్థానాన్ని కాపాడుకోవడం సాధ్యం కాలేదు. పెరుగుతున్న వయస్సు, పేలవమైన ప్రదర్శన కారణంగా, ఈ ముగ్గురు అనుభవజ్ఞులు టీమ్ ఇండియాకు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న టీమ్ ఇండియా ముగ్గురు ఆటగాళ్లను చూద్దాం.

1. అజింక్యా రహానే..

జులై 2023లో వెస్టిండీస్ టూర్‌లో అజింక్య రహానే టీమ్ ఇండియా తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అజింక్య రహానే భారత్ తరపున ఇప్పటివరకు 85 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 38.46 సగటుతో 5077 పరుగులు చేశాడు. అజింక్య రహానే తన టెస్టు కెరీర్‌లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు సాధించాడు. అజింక్యా రహానె వయసు ఇప్పుడు 36 ఏళ్లు కావడంతో టీమ్ ఇండియా నుంచి తప్పుకున్నాడు. అజింక్య రహానే గురించి మాట్లాడితే, అతని నిలకడ అతిపెద్ద సమస్య, అతను ప్రతి మ్యాచ్‌లో జట్టుకు గణనీయమైన సహకారం అందించలేకపోయాడు.

2. వృద్ధిమాన్ సాహా..

భారత టెస్టు జట్టులోకి వృద్ధిమాన్ సాహా తిరిగి రావడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. వృద్ధిమాన్ సాహాకు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండింటిలోనూ గొప్ప అనుభవం ఉంది. అయితే, ఇప్పుడు రిషబ్ పంత్, ధృవ్ జురెల్ వంటి వికెట్ కీపర్ల కారణంగా వృద్ధిమాన్ సాహాకు టీమిండియా తలుపులు దాదాపు మూసుకుపోయాయి. వృద్ధిమాన్ సాహా 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 39 ఏళ్ల వృద్ధిమాన్ సాహా కేవలం 40 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. వృద్ధిమాన్ సాహా టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను 40 టెస్టుల్లో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

3. ఇషాంత్ శర్మ..

టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ మళ్లీ భారత క్రికెట్ జట్టులో అవకాశం దక్కించుకోవడం కష్టంగా మారింది. ఇషాంత్ శర్మ నవంబర్ 2021లో టీం ఇండియా తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. పేలవమైన ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా ఇషాంత్ శర్మను టీమ్ ఇండియా నుంచి తప్పించారు. టీమిండియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు భారత క్రికెట్ జట్టు తలుపులు దాదాపుగా మూసుకుపోయాయి. ఇషాంత్ శర్మ 105 టెస్టు మ్యాచ్‌లు ఆడి 311 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ వన్డేల్లో 115 వికెట్లు, టీ20లో 8 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..