AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: చెన్నై రిటైన్ చేసే ఐదుగురు ఆటగాళ్లు వీరే.. ధోనిపై ఇష్యూపై కీలక అప్‌డేట్..

Chennai Super Kings Retentions Update: IPL 2025కి సంబంధించి చాలా సందడి నెలకొంది. దీనికి అతిపెద్ద కారణం మెగా వేలం అనే సంగతి తెలిసిందే. అదే సమయంలో, అందరి చూపు చెన్నై సూపర్ కింగ్స్‌పైనే ఉంది. ఎందుకంటే ఎంఎస్ ధోని వచ్చే సీజన్‌లో ఆడతాడా లేదా అని తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పుడు ధోనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త బయటకు వస్తోంది.

IPL 2025: చెన్నై రిటైన్ చేసే ఐదుగురు ఆటగాళ్లు వీరే.. ధోనిపై ఇష్యూపై కీలక అప్‌డేట్..
Csk Ipl 2025 Auction
Venkata Chari
|

Updated on: Sep 22, 2024 | 4:40 PM

Share

Chennai Super Kings Retentions Update: IPL 2025కి సంబంధించి చాలా సందడి నెలకొంది. దీనికి అతిపెద్ద కారణం మెగా వేలం అనే సంగతి తెలిసిందే. అదే సమయంలో, అందరి చూపు చెన్నై సూపర్ కింగ్స్‌పైనే ఉంది. ఎందుకంటే ఎంఎస్ ధోని వచ్చే సీజన్‌లో ఆడతాడా లేదా అని తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పుడు ధోనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త బయటకు వస్తోంది. వచ్చే సీజన్‌లో కూడా మాజీ CSK కెప్టెన్ మ్యాజిక్ చూడవచ్చని తెలుస్తోంది. రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా నిబంధనలను ప్రకటించనప్పటికీ, సీఎస్‌కే మాత్రం ధోనీని రిటైన్ చేయాల్సిన ఆటగాళ్ల జాబితాలో చేర్చింది.

చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్‌పై కీలక సమాచారం..

చెన్నై ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని, ఇద్దరికి RTM కార్డులు ఉంటాయని భావించినట్లు మీడియా నివేదికలలో పేర్కొంది. ఇటువంటి పరిస్థితిలో, ఫ్రాంచైజీ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మతిషా పతిరనా, ఎంఎస్ ధోనీలను కొనసాగించాలని ప్లాన్ చేసింది. ధోనీ తదుపరి సీజన్‌లో ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించబలేదు. అయితే, మాజీ కెప్టెన్ ఫ్రాంచైజీ పర్స్ విలువ కంటే ఎక్కువ డబ్బు కోరుకోవడం లేదు. ఈ కారణంగా అతి తక్కువ మొత్తానికి రిటైన్ అవనున్నట్లు తెలుస్తోంది. లేదా BCCI అనుమతిస్తే, అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడటం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

పాత నిబంధన ప్రకారం, ఒక ఆటగాడు ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోతే, అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తుంటారు. ఈ నిబంధన 2021 సంవత్సరం నుంచి తీసివేశారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఈ నియమాన్ని మళ్లీ ఉపయోగించాలని యోచిస్తోంది. అయితే ఈ నిబంధనను తిరిగి తీసుకురావాలా లేదా అనేది పూర్తిగా IPL గవర్నింగ్ కౌన్సిల్‌పై ఆధారపడి ఉంటుంది.

త్వరలోనే నిబంధనలను ప్రకటించే అవకాశం..

మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ ఇంకా నిబంధనలను ప్రకటించలేదు. ఈ కారణంగా ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేయాలనే విషయంలో గందరగోళం నెలకొంది. అయితే, నిబంధనలను త్వరలోనే ప్రకటించవచ్చని, నవంబర్ చివరిలో భారతదేశం వెలుపల మెగా వేలం నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఫ్రాంచైజీ ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేస్తుందనేది నిబంధనల ప్రకటన తర్వాతే వెల్లడి అవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..