IND vs NZ: కివీస్‌తో పోరుకు ఏర్పాట్లు షురూ.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ముంబై క్రికెట్..

India vs New Zealand Wankhede Test: ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది.

IND vs NZ: కివీస్‌తో పోరుకు ఏర్పాట్లు షురూ.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ముంబై క్రికెట్..
Ind Vs Nz
Follow us

|

Updated on: Sep 22, 2024 | 6:39 PM

India vs New Zealand Wankhede Test: ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత మూడు టీ20లు జరగనున్నాయి.

ఆ తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌ జట్టు పర్యటించనుంది. ఇందులో భాంగా మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఇరుజట్లు ఆడనున్నాయి. అయితే, మూడో టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించి ప్రేక్షకులకు ఓ షాక్ ఇచ్చింది. టిక్కెట్ ధరల విషయంలో ముంబై క్రికెట్ కీలక ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన ధరల కంటే కాస్త పెంచినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. నవంబర్ 1-5 వరకు వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

2021లో ఇక్కడ వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌లు చివరిసారిగా టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ టెస్ట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

2021లో కోవిడ్ ప్రోటోకాల్‌ల కారణంగా రోజుకు 25 శాతం సామర్థ్యం (సుమారు 8000 మంది) మాత్రమే అనుమతించారు. రోజువారీ టిక్కెట్‌ల ధర రూ. 125లు ఉంచగా, అయితే సీజన్ టిక్కెట్‌ ధరను రూ. 375లుగా ఉంచారు. వాంఖడేలో, విఐపి బాక్స్ టిక్కెట్‌లు విక్రయించడం లేదని తెలిపింది. ఇది ఆహ్వానితులతోపాటు అధికారులు, BCCI, MCA అతిథులకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపింది.

కాగా, ముంబై స్టేడియంలో టిక్కెట్ల ధరలు గతంలో రోజువారీ టిక్కెట్‌కు రూ. 100లు కాగా, ఐదు రోజుల టిక్కెట్‌కు రూ. 300లుగా పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..