IPL: ఐపీఎల్‌లో ఆడాలని ఉంది.. భారీగా డబ్బు వస్తుంటే ఎవరైనా వద్దంటారా: పాకిస్థాన్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..
IPL 2024: ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అంటే 2008 IPLలో షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది వంటి పాకిస్థాన్ అతిపెద్ద ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే ఆ సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. ఐపీఎల్ 2008లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సొహైల్ తన్వీర్ నిలిచాడు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL).. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. అలాగే ఈ మిలియన్ డాలర్ల టోర్నీలో ఆడాలని ప్రతి క్రికెటర్‌కు కల కంటుంటాడు. కొందరు క్రికెటర్లు అందులో విజయం సాధిస్తే, కొంతమంది క్రికెటర్లకు మాత్రం ఈ కల కలగానే ఉంటుంది. అలాంటి వారిలో పాకిస్థాన్ క్రికెటర్లు (Pakistan Cricketers) కూడా ఉన్నారు. ఎంతో మంది ప్రతిభ ఉన్నా పాక్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడలేకపోతున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడాలని ఇప్పటికే తమ కోరికను వ్యక్తం చేశారు. ఈ లిస్టులో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hassan Ali) కూడా చేరాడు.
అవకాశం వస్తే తప్పకుండా ఆడతాను..
పాకిస్తానీ టీవీ షోలో హసన్ అలీ నుంచి మీకు ఐపీఎల్ ఆఫర్ వస్తే మీరు ఏమి చేస్తారు? అనే ప్రశ్న అడిగారు. దీనిపై హసన్ స్పందిస్తూ.. ‘ఐపీఎల్ చాలా పెద్ద లీగ్. ఇందులో గ్లామర్ ఉంది. పొయిస్ ఉంది. ప్రతి ఆటగాడు ఐపీఎల్‌లో భాగం కావాలని కోరుకుంటాడు. నాకు ఐపీఎల్ ఆడాలని ఉంది. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా అక్కడ ఆడతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు..
నిజానికి ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అంటే 2008 IPLలో షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది వంటి పాకిస్థాన్ అతిపెద్ద ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే ఆ సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. ఐపీఎల్ 2008లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సొహైల్ తన్వీర్ నిలిచాడు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పాకిస్థానీ ఆటగాడికి ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం రాలేదు.
ప్రపంచకప్ జట్టులో హసన్ అలీ..
హసన్ అలీ విషయానికొస్తే, అతను 2023 ODI ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. గాయపడిన నసీమ్ షా స్థానంలో హసన్ అలీ వన్డే ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన హసన్ అలీ 9 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
