virat kohli: విరాట్ కోహ్లీ వేసుకున్న ఈ కొత్త టాటూ అర్థం ఏంటో తెలుసా.? ఇందులో ఇంత మీనింగ్ ఉందా..
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఆటతోనే కాకుండా స్టైలిష్ లుక్స్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అంతర్జాతీయ సంస్థలను ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. స్టైలిష్ లుక్స్‌తో పాటు టాటూలతోనూ..

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఆటతోనే కాకుండా స్టైలిష్ లుక్స్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అంతర్జాతీయ సంస్థలను ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. స్టైలిష్ లుక్స్‌తో పాటు టాటూలతోనూ అట్రాక్ట్ చేస్తుంటాడు విరాట్. టాటూలను విపరీతంగా ఇష్టపడే విరాట్ ఎప్పటికప్పుడు కొంగొత్త టాటూలతో కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా చేతిపై కొత్త టాటును వేయించుకున్నాడు విరాట్. ఈ టాటూ చూడడానికి ఆసక్తిగా ఉండడంతో అభిమానుల దృష్టికాస్త దానిపై పడింది.
ఇదిలా ఉంటే తాజాగా అభిమానుల అనుమాలను నివృత్తి చేస్తూ టాటూ ఆర్టిస్ట్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఏలియన్స్ టాటూ సంస్థ యజమాని సన్నీ భానుషాలి కోహల్ఈకి ఈ టాటూను వేశాడు. ఆయనే స్వయంగా ఈ టాటూ మీనింగ్ ఏంటో వివరించాడు. కొన్నేళ్ల కిందట విరాట్ కోహ్లీ తన ఆఫీస్‌కు వచ్చాడని చెప్పుకొచ్చారు. విరాట్ ఆయన ఫేమ్‌ను కూడా పక్కన పెట్టి ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. మమ్మల్ని ఎంతగానో అభినందించాడు. నిజానికి టాటూ ఎప్పుడే వేయించుకోవాల్సి ఉన్నా.. బిజీ షెడ్యూల్‌తో చాలా రోజులపాటు కుదరలేదని చెప్పుకొచ్చాడు.




View this post on Instagram
అయితే గత నెలలో మళ్లీ విరాట్.. తన పాత టాటూను కవర్ చేసేలా కొత్తది వేయాలని సూచించాడని, అది తన ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఉండాలని, జీవిత చక్రం మొత్తం అందులో కనిపించాలని విరాట్ వివరించినట్లు టాటూ ఆర్టిస్ట్ తెలిపాడు. ఇర టాటూ డిజైన్ కోసం తాను మనస్ఫూర్తిగా కష్టపడ్డానని. ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా ఉండేందుకు తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చారు. ఇక టాటూ వేసే సమయంలో స్టూడియోను పూర్తిగా మూసి వేయించి మరీ కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తన అనుభవాన్ని పంచుకున్నాడు.
మరిన్ని క్రికెట్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
