కేవలం రెండు మ్యాచ్‌లే, కళ్లు బైర్లు కమ్మే స్ట్రైక్‌రేట్.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి చిచ్చరపిడుగు ఎంట్రీ.!

ఐపీఎల్ అంటేనే ఊచకోతకు కేరాఫ్ అడ్రస్. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మొదటి బంతి నుంచే సిక్సర్లు, ఫోర్లతో పెను విధ్వంసం సృష్టిస్తారు. తక్కువ బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఇక అలాంటివారి కోసం జల్లెడ చేసి..

కేవలం రెండు మ్యాచ్‌లే, కళ్లు బైర్లు కమ్మే స్ట్రైక్‌రేట్.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి చిచ్చరపిడుగు ఎంట్రీ.!
Delhi Capitals
Follow us

|

Updated on: Mar 14, 2024 | 3:54 PM

ఐపీఎల్ అంటేనే ఊచకోతకు కేరాఫ్ అడ్రస్. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మొదటి బంతి నుంచే సిక్సర్లు, ఫోర్లతో పెను విధ్వంసం సృష్టిస్తారు. తక్కువ బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఇక అలాంటివారి కోసం జల్లెడ చేసి మరీ వేలంలో కొనుగోలు చేస్తుంటారు ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇక ఇప్పుడు ఆ కోవకు చెందిన ఓ చిచ్చరపిడుగు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ 21 ఏళ్ల యంగ్ ప్లేయర్ స్ట్రైక్‌రేట్ చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అంతేకాదు లిస్టు-ఏ కెరీర్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ ప్లేయర్‌ను కొనాలని చూస్తోంది. మరి అతడెవరో తెలుసుకుందామా..

జాక్ ఫ్రేజర్ మెక్ గుర్క్.. ఈ పేరు గురించి భారత్ ఫ్యాన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అతడు ఆస్ట్రేలియాలో మాత్రం పెద్ద సెన్సేషన్. ఈ 21 ఏళ్ల యంగ్ ప్లేయర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. లిస్టు-ఏ క్రికెట్‌లో చేసిన ఒకే ఒక్క ఫాస్టెస్ట్ సెంచరీతో.. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు మెక్‌గుర్క్. అతడు గతేడాది కేవలం 29 బంతుల్లోనే ఫాస్టెస్ట్ శతకాన్ని కొట్టి.. దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

ఆ మ్యాచ్‌లో మొత్తం 38 బంతులు ఎదుర్కుని 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు మెక్‌గుర్క్. బిగ్‌బాష్ లీగ్‌లో ఓపెనర్‌గా మనోడు సృష్టించే ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక వెస్టిండీస్ సిరీస్‌తో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మెక్‌గుర్క్.. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఏకంగా 222 స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దూరమైన హ్యారీ బ్రూక్ స్థానంలో మెక్‌గుర్క్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది యాజమాన్యం. ఈ రీప్లేస్‌మెంట్ డీల్‌పై రెండు లేదా మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.