ODI Captains: అత్యధిక వన్డేలకు కెప్టెన్లుగా ఐదుగురు దిగ్గజాలు.. లిస్టులో భారత్ నుంచి ఒకరు..
Most ODI Matches As A Captains: వన్డేల్లో ఇప్పటి వరకు ఎందరో విజయవంతమైన కెప్టెన్లు ఉన్నారు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ ముందంజలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. కాబట్టి, ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం..

ODI Captains: వన్డే క్రికెట్ చాలా ముఖ్యమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ ప్రతి 4 సంవత్సరాలకు నిర్వహిస్తుంటారు. దీని కారణంగా దాని ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. వన్డేల్లో ఏ జట్టు గెలుపు, ఓటమి అనేది ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపైనే కాకుండా కెప్టెన్ వ్యూహంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏ బౌలర్‌కి ఎప్పుడు బౌలింగ్ చేయాలి. ఏ బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి వ్యూహం అనుసరించాలి ఇలా అన్ని నిర్ణయాలను కెప్టెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్సీ ప్రాధాన్యత చాలా పెరుగుతుంది.
వన్డేల్లో ఇప్పటి వరకు ఎందరో విజయవంతమైన కెప్టెన్లు ఉన్నారు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ ముందంజలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ లిస్టులో ధోని కూడా ఉన్నాడు. కాబట్టి, ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం..
అత్యధిక వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఐదుగురు దిగ్గజ కెప్టెన్లు..
5. అలన్ బోర్డర్(1985-1994)
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ అలన్ బోర్డర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 1985 నుంచి 1994 వరకు ఆస్ట్రేలియా ODI జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కాలంలో, అతని కెప్టెన్సీలో, కంగారూ జట్టు 178 ODI మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 107 గెలిచింది. 67 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, 3 మ్యాచ్‌ల్లో ఫలితం లేదు.
4. అర్జున్ రణతుంగ (1988-1999)
శ్రీలంక ఇప్పటి వరకు ఒకే ఒక క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. 1996లో అర్జున రణతుంగ నాయకత్వంలో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. రణతుంగ 193 మ్యాచ్‌లలో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో ఆ జట్టు 89 గెలిచారు. 95 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇది కాకుండా, 1 మ్యాచ్ టై కాగా, 8 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
3. ఎంఎస్ ధోని (2007-2018)
ఎంఎస్ ధోని భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతని కెప్టెన్సీలో, భారత జట్టు 2007 T20 వరల్డ్, 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. 200 వన్డే మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 110 మ్యాచ్‌లు గెలిచి 74 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 5 మ్యాచ్‌లు టై కాగా, 11 మ్యాచ్‌ల్లో ఫలితం లేదు.
2. స్టీఫెన్ ఫ్లెమింగ్ (1997-2007)
న్యూజిలాండ్ దిగ్గజ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 218 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 98 విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీలో, కివీ జట్టు 106 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 1 మ్యాచ్ టై అయ్యింది. 13 మ్యాచ్‌లు ఫలితం లేదు.
1. రికీ పాంటింగ్ (2002-2012)
వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు రికీ పాంటింగ్. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. పాంటింగ్ 229 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో అతను 164 మ్యాచ్‌లు గెలిచాడు. అతని నాయకత్వంలో కంగారూ జట్టు కేవలం 51 మ్యాచ్‌ల్లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








