CSK Vs RR: ఆ కీలక ప్లేయర్ ఔట్.. ధోని టీందే విజయం.. ప్లేయింగ్ XI ఇదే.!
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు..
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పలు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. అటు ధోనిది ఇది 200వ మ్యాచ్ కావడంతో.. సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ఎలగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా విజయం కోసమే ప్రణాళికలు సిద్దం చేసింది. ఎలాగైనా చెన్నైను ఓడించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని చూస్తోంది.
సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవన్ విషయానికొస్తే.. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లు కాగా.. రహనే, మొయిన్ అలీ, శివమ్ దుబే మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నారు. ఇక రవీంద్ర జడేజా స్పిన్ విభాగంలోనూ.. అటు ఆల్‌రౌండర్‌గా మెరుపులు మెరిపించనుండగా.. ఎప్పటిలానే ధోని ఫినిషర్ రోల్ పోషిస్తాడు. మగలా, తీక్షణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్నారు. అటు చెన్నై సబ్‌స్టిట్యుట్స్‌గా.. అంబటి రాయుడు, శాంట్నర్, షేక్ రషీద్, సేనాపతి, హంగర్‌గేకర్ ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా.. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఓపెనర్లు, శాంసన్ వన్ డౌన్, పడిక్కల్, హెట్‌మెయిర్, ధృవ్ జురెల్ మిడిల్ ఆర్డర్‌లో వస్తారు. అశ్విన్, చాహల్ స్పిన్ విభాగాన్ని చూసుకుంటే.. జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లు. రాజస్థాన్ సబ్‌స్టిట్యుట్స్‌గా.. రియాన్ పరాగ్, ఫెర్రేరా, ఆసిఫ్, జంపా, జో రూట్ ఉన్నారు.
కాగా, రాయల్స్ కీలక బౌలర్.. గత మ్యాచ్‌ల్లో మొదటి ఓవర్‌లోనే తన స్వింగ్‌తో రెండేసి వికెట్లు తీసిన బౌల్ట్ లేకపోవడంతో.. చెన్నై ఫ్యాన్స్ తమ జట్టునే విజయం వరిస్తుందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.