AC: ఏసీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే ఇలా చేస్తే డబ్బులు తగ్గుతాయ్!

ఎండలు మండిపోతున్నాయ్. భానుడి భగభగలకు జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతకు అందరూ..

AC: ఏసీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే ఇలా చేస్తే డబ్బులు తగ్గుతాయ్!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 11, 2023 | 8:53 PM

ఎండలు మండిపోతున్నాయ్. భానుడి భగభగలకు జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతకు అందరూ కూడా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆన్ చేసేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే అటు ఏసీ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యుడి తాపాన్ని తట్టుకునేందుకు ఏసీని అద్దెకు తీసుకోవడమే ఉన్న ఏకైక మార్గం. వాస్తవానికి ఏసీలు అద్దెకిస్తారని చాలా మందికి తెలియదు. కానీ మీరు అనేక ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా ACలను అద్దెకు తీసుకోవచ్చు. దీనిలో మీకు కలిగే మరో ప్రయోజనం ఏంటంటే.. వాటికి నిర్వహణ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

అలా మీరు డబ్బును పొదుపు చేయొచ్చు. అయితే ఆన్‌లైన్ ద్వారా ఏసీని అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని షరతులు వర్తిస్తాయి. అలాగే ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే.. డబ్బులు చెల్లించే ముందే కస్టమర్ కేర్‌తో సందేహాలను నివృత్తి చేసుకోండి. అలాగే వెబ్‌సైట్ ప్రామాణికతను కూడా కచ్చితంగా చూసుకోవాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో మీరు ఏసీని అద్దెకు తీసుకోవచ్చు. రెంట్ మోజో, సిటీ ఫర్నిష్ లాంటి ఆన్‌లైన్ సైట్లు రెంట్‌కు ఏసీలను అందిస్తున్నాయి. మీరు ఎంతకాలం పాటు ఏసీని వాడతారో.. అప్పటివరకు అద్దె డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏసీని ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లిస్తారు.

రెంట్ మోజో అనే సైట్‌లో ఉచిత రీలొకేషన్ అప్‌గ్రేడ్ సౌకర్యం ఉండగా.. లైనప్ నెలకు రూ.1,399 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఒక స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌ను అద్దెకు తీసుకోవాలంటే కనీసం రూ. 1,949 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అది మళ్లీ ఏసీ తిరిగి ఇచ్చకా చెల్లిస్తారు. అటు ఇన్‌స్టాలేషన్ ఛార్జీ రూ.1,500 వరకు వసూలు చేస్తారు.