AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Kumar Yadav: బంగ్లా పర్యటనకు ఆ ఆటగాడిని ఎందుకు ఎంపిక చేయలేదంటూ అభిమానుల ఆగ్రహం.. బీసీసీఐ వివక్ష చూపుతోందంటూ ఆరోపణ..

వన్డే ఫార్మాట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ పర్యటనలో స్థానం ఇవ్వలేదు బీసీసీఐ. దీంతో క్రికెట్ అభిమానులంతా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ విషయంలోనూ..

Surya Kumar Yadav: బంగ్లా పర్యటనకు ఆ ఆటగాడిని ఎందుకు ఎంపిక చేయలేదంటూ అభిమానుల ఆగ్రహం.. బీసీసీఐ వివక్ష చూపుతోందంటూ ఆరోపణ..
Surya Kumar Yadav
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 25, 2022 | 8:45 AM

Share

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన ప్రతాపాన్ని చూపించాడు. అతను కొట్టిన షాట్లకు అభిమానులే కాక అంతర్జాతీయ క్రికెట్ మాజీలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఈ యువ ఆటగాడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేనా అంతర్జాతీయ క్రికెట్‌లో అతనే ప్రస్తుత అత్యుత్తమ టీ20 బ్యాటర్ కూడా. అంతేకాక న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా సూర్య తనదైన రీతిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. అతని ఆట తీరుపై సర్వత్రా ప్రశంసలే వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆటగాడు భారత జట్టులోకి మూడు, నాలుగేళ్ల క్రితమే వచ్చి ఉంటే బాగుండేదనుకునేవారూ లేకపోలేదు. ఆలస్యంగానే ఆరంగేట్రం చేసిన అతను వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ వెలుగులోకి వస్తున్నాడు.

అయితే డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్, రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఇప్పటికే వన్డే ఫార్మాట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ పర్యటనలో స్థానం ఇవ్వలేదు బీసీసీఐ. దీంతో క్రికెట్ అభిమానులంతా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ విషయంలోనూ బీసీసీఐ ఇలాగే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. బీసీసీఐ ఒక కులానికే అనుకూలంగా ఉంటూ.. మిగిలినవారికి అన్యాయం చేస్తోందని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అంతేకాక ట్విట్టర్లో #Castiest_BCCI అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీ20లను అత్యద్భుతంగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ వన్డేలు ఆడలేడా…? వన్డేలు ఆడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని సూర్య, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లకు బీసీసీఐ అన్యాయం చేస్తోందని వారు మండిపడుతున్నారు. కొంత మంది అయితే క్రికెట్‌లోనూ తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు.

కాగా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలో ఈ సిరీస్‌కు జట్టును ప్రకటించగా.. అందులో సూర్య, సంజూ శాంసన్‌ కూడా ఉన్నారు. కానీ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు వీరిలో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు. బంగ్లాతో టెస్టులు, వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ సారథ్యంలో టీమిండియా ఆడనుంది. ఇప్పటికే మోకాలి సర్జరీ చేయించుకున్న జడేజా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో జట్టులోకి అతడి స్థానంలో మరో ఆటగాణ్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. సూర్యను త్వరలోనే టెస్టులకు కూడా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం సూర్యను మెల్లగా పక్కనబెట్టేస్తారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.