Virat Kohli: చొక్కా లేకుండా కండల కసరత్తు చేస్తున్న ఆ మాజీ కెప్టెన్ .. వైరల్ అవుతున్న వీడియో..
ఇటీవల జరిగిన ఐఐసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి దూరంగా ఉన్న అతను కొద్ది రోజులపాటు కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే..
ఇటీవల జరిగిన ఐఐసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి దూరంగా ఉన్న అతను కొద్ది రోజులపాటు కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే వచ్చే నెల బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లనున్నాడు మన కింగ్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే అనుకుంటా.. తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి చెమటోడ్చి మరీ కసరత్తులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తన షర్ట్ విప్పి మరీ బరువులు లాగుతున్నట్లు, త్రెడ్‌మిల్‌పై పరిగెడుతున్న సన్నివేశాలు ఉన్న ఓ వీడియోను కోహ్లీ తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోకి అభిమానుల నుంచే కాకుండా భారత జట్టులోని సభ్యుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అయితే చిరుత ఎమోజీని కామెంట్ రూపంలో పెట్టి కోహ్లీని చిరుతతో సరిపోల్చాడు. కండలు తిరిగిన శరీరాన్ని కలిగి ఉన్న కోహ్లి శాకాహారి అంటే చాలా మంది నమ్మరేమో.. ఒకప్పుడు నాన్‌వెజ్‌ను ఎంతో ఇష్టంగా తినే విరాట్.. దానిని మానేసి శాకాహారిగా మారిపోయి కూరగాయలను ఎక్కువగా తీంటున్నాడు.
2018లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లి సెర్వికల్ స్పైన్ సమస్య ఎదురయింది. విరాట్‌ను ఆ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ.. రాత్రుళ్లు సరిగా నిద్ర పోయేవాడు కాదట. మాంసాహారం మానేయడం తనకు చాలా ఉపయోగపడిందని అతను చెబుతుంటాడు. ప్రస్తుతం కోహ్లీ మాంసాహారం మానేసి గుడ్లు మాత్రమే తింటున్నాడు. కోహ్లి పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఓ అభిమాని స్పందిస్తూ.. ‘మాంసాహారం తినకపోతే కండలు పెంచలేమనేది కొందరి అభిప్రాయమ’ని కామెంట్ చేయగా.. దానికి ‘అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అపోహ’ అని విరాట్ బదులిచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..