రాసిపెట్టుకోండి.. లంకలో టీమిండియా బ్రహ్మాస్త్రం అతడే.. రావణలంకలా తగలబెట్టేస్తాడు..!
India vs Sri Lanka Test: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ ఆల్ రౌండర్ అటాకింగ్ మైండ్ సెట్‌తో ఉంటే శ్రీలంక బ్యాటర్లకు తిప్పలు తప్పవు. పూజారా చెప్పినట్లుగా ఇతని స్పిన్ మ్యాజిక్ పనిచేస్తే లంక గడ్డపై భారత్ మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

India vs Sri Lanka Test: శ్రీలంకతో టెస్టు సమరానికి టీమిండియా సిద్ధమవుతున్న వేళ మాజీ బ్యాటర్ చతేశ్వర్ పూజారా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని, లంక పర్యటనలో అతడే భారత జట్టుకు ప్రధాన అస్త్రంగా మారబోతున్నాడని పూజారా జోస్యం చెప్పడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
పరుగుల కట్టడి కాదు.. వికెట్ల వేట మాత్రమే!
జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు ఈ నెల 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. కాండీ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న ఈ కీలక సిరీస్‌కు సంబంధించి టీమిండియా వ్యూహాలపై చతేశ్వర్ పూజారా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గతంలో జడేజా బౌలింగ్ శైలికి, ఇప్పటి అతని శైలికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని స్పష్టం చేశాడు. ఒకప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా జడ్జూ బౌలింగ్ చేసేవాడని, మైండ్ సెట్ చాలా డిఫెన్సివ్‌గా ఉండేదని పూజారా గుర్తుచేశాడు.
ఇది కూడా చదవండి: Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!
ప్రతి బంతి స్టంప్ లైన్‌లోనే.. ప్రత్యర్థులకు గండమే!
గడిచిన కొంతకాలంగా జడేజా ఆట తీరు పూర్తిగా మారిపోయిందని పూజారా వివరించాడు. తన బలాలు ఏంటో స్పష్టంగా తెలుసుకున్న జడేజా, ఇప్పుడు కేవలం వికెట్లు పడగొట్టడమే లక్ష్యంగా బంతులు విసురుతున్నాడని తెలిపాడు. ఇప్పుడు అతడు వికెట్లు తీయడంలో పూర్తి నేర్పరిగా మారాడని ప్రశంసించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ బంతిని వికెట్ల లైన్‌లోనే వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ రకమైన అటాకింగ్ మైండ్ సెట్ లంక స్పిన్ పిచ్‌లపై భారత జట్టుకు తిరుగులేని విజయాన్ని అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు.
ఆరు నెలల తర్వాత రీఎంట్రీ.. లంకపై ఊచకోత రికార్డు!
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత రవీంద్ర జడేజా తిరిగి టెస్టు జట్టులోకి అడుగుపెడుతున్నాడు. గతేడాది నవంబర్‌లో గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ బాది దంచికొట్టాడు. శ్రీలంకపై జడేజాకు కళ్లు చెదిరే రికార్డు ఉంది. లంకతో ఆడిన 7 టెస్టుల్లోనే 65 సగటుతో 326 పరుగులు సాధించాడు. టెస్టుల్లో తన కెరీర్ బెస్ట్ స్కోరు 175 పరుగులు కూడా లంకపైనే నమోదు చేయడం గమనార్హం.
ఆల్‌రౌండ్ షోతో సరికొత్త చరిత్రకు సిద్ధం!
కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ శ్రీలంక గడ్డపై జడేజా రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో 24 సగటుతో 33 వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇప్పటివరకు 85 టెస్టులు ఆడిన జడ్జూ 348 వికెట్లు తీసి, 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌లోనూ 4,095 పరుగులు చేసి 6 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇప్పుడు లంక పర్యటనలోనూ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు సిరీస్ అందించేందుకు సమాయత్తమవుతున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




