AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండక్కీ సత్తు పిండి తయారు చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు ఇవే

అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు బతుకమ్మ సంబురాలు మొదలైపోతుంటాయి. ఇక నెల రోజుల ముందు నుంచే పండుగకు కావాల్సిన వాటిని ప్రిపేర్ చేసుకుంటారు మహిళలు ముఖ్యంగా షాపింగ్ చేయడం, పిండి వంటల కోసం పప్పులను సిద్ధం చేసుకోవడం , పూల చెట్లను జాగ్రత్తగా కాపాడుకోవడం, ప్రతి రోజూ నీళ్లు పోయడం ఇలా ముందు నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

Samatha J
|

Updated on: Oct 06, 2026 | 4:09 PM

Share
అక్టోబర్ 10 మహాలయ అమావాస్య నుంచే బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఇక ఈ పండుగ అంటే కేవలం కొత్త బట్టలు, పువ్వులు, బతుకమ్మ మాత్రమే కాదండోయ్, పిండి వంటలు, సత్తు పిండి ప్రసాదాలు కూడా ఎక్కువే ఉంటాయి. అయితే మీరు కూడా పండక్కీ సత్తు పిండి  తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ముందు జాగ్రత్తలు మీ కోసమే..

1 / 5
బతుకమ్మ పండుగ సమయంలో మీ కుటుంబ సభ్యులు అందరూ సత్తు పిండి ఇష్టంగా తినాలి అంటే? అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అన్నా ముందు నుంచే పప్పులు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా ఈ పండుగకు గోధుమలు, మక్కజొన్నలు, నువ్వులు,పల్లీలు, బియ్యం, శనగపప్పు, పెసరపప్పులతో సత్తు పిండి తయారు చేస్తుంటారు. అయితే వీటిని మీరు మెషిన్‌లో పట్టించుకోవడానిక ముందే ఎండలో ఆరబెట్టాలంట.

2 / 5
దాదాపు మూడు రోజుల పాటు పప్పులన్నింటిని ఎండలో ఎండ బెట్టాలి. తర్వాత వాటిని ఒకేసారి అన్నీ కాకుండా, ఒక్కో దానినిని ప్రత్యేకంగా మంచిగా జాగ్రత్తగా వేయించాలి. మాడిపోవడం కానీ, పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి. దీని వలన సత్తుపిండిల రుచి మారడమే కాకుండా, త్వరగా పాడైపోతుంది.

3 / 5
ఇక కొంత మంది వీటిని నూనె పోసి వేయిస్తూ ఉంటారు. కానీ ఇలా వేయించడం అస్సలే మంచిది కాదంట. వీలైనంత వరకు పప్పులను నూనెలేకుండా, వీలైతే మీ దగ్గర మట్టి కుండ ఉంటే, వాటిని పొయ్యిపై మట్టి కుండలో వేయించడం వలన రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నూనెలో వేయిస్తే, వాటికి పురుగు పట్టి, త్వరగా పాడవుతుందంట.

4 / 5
అంతే కాకుండా కొంచెం గోరు వెచ్చగా ఉన్నా సరే వాటిని మిక్సీ పట్టకూడదు. వీలైనంత వరకు మంచిగా వేగి, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వాటిని మిక్సీ పట్ట్టించుకోవాలి. అలాగే మరీ మెత్తగా కాకుండా పిండి కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా పట్టించిన వెంటనే బాక్స్‌లో వేసి స్టోర్ చేయకుండా కాసేపు పేపర్ పై వేసి, ఆరబెట్టడం మంచిదంట.

5 / 5
Follow Us