Hotel Secrets: 5 స్టార్ హోటళ్లలో బాత్రూమ్‌లకు గాజు గోడలే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!
విలాసవంతమైన 5 స్టార్ హోటళ్లు లేదా ఆధునిక రిసార్టులలో బస చేసినప్పుడు చాలామంది ఒక విషయాన్ని గమనించే ఉంటారు. అక్కడి బెడ్‌రూమ్‌లకు ఆనుకుని ఉండే బాత్రూమ్‌లకు సిమెంట్, ఇటుక గోడలకు బదులుగా పూర్తిగా పారదర్శకంగా ఉండే గాజు గోడలను (Glass Walls) ఏర్పాటు చేస్తుంటారు. బయట ఉన్నవారికి లోపల స్నానం చేస్తున్న వ్యక్తి స్పష్టంగా కనిపించేలా ఉండే ఈ డిజైన్ చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. తోటి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినప్పుడు ప్రైవసీ ఎలా సాధ్యమని సందేహం కలుగుతుంది. అయితే హోటల్ యాజమాన్యాలు ఇలా గాజు బాత్రూమ్‌లను నిర్మించడం వెనుక కేవలం లగ్జరీ లుక్ మాత్రమే కాకుండా అనేక కారణాలు దాగి ఉన్నాయి.

హోటళ్లలో గాజు స్నానాల గదుల గురించి చాలా మందికి తెలిసు. కేవలం లగ్జరీ హోటళ్లలోనే కాకుండా ఇప్పుడు సాధారణ హోటళ్లు, బోటిక్ రిసార్ట్‌లలో కూడా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. అతిథుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండానే హోటల్ గదిని విశాలంగా, ఆకర్షణీయంగా మార్చడానికి ఆర్కిటెక్ట్‌లు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు.
గదిని విశాలంగా చూపించే ఆప్టికల్ భ్రమ(Space Illusion) హోటల్ గదుల్లో గాజు గోడలను అమర్చడానికి ప్రధాన కారణం స్థలాన్ని ఆదా చేయడం , గదిని పెద్దదిగా కనిపించేలా చేయడం. సాధారణంగా కాంక్రీట్ లేదా ఇటుక గోడలు గదిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి ఇరుకుగా చూపిస్తాయి. కానీ పారదర్శక గాజు గోడలు కంటి చూపును అడ్డుకోకుండా గది అంతటినీ ఒకే విశాలమైన ప్రదేశంగా చూపిస్తాయి. దీనివల్ల కాంపాక్ట్ సైజులో ఉండే చిన్న హోటల్ గది కూడా ఎంతో విశాలంగా, విలాసవంతంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది.
సహజ వెలుతురు… బెడ్‌రూమ్ కిటికీలు లేదా బాల్కనీల నుండి వచ్చే సహజమైన సూర్యకాంతి నేరుగా బాత్రూమ్‌లోకి ప్రవేశించేందుకు ఈ పారదర్శక గాజు వీలు కల్పిస్తుంది. పగటి సమయాల్లో బాత్రూమ్‌లో ప్రత్యేకంగా లైట్లు ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల హోటల్ యాజమాన్యాలకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయి. అంతేకాకుండా, గదిలో ఉన్న లైటింగ్ , డెకరేషన్‌తో కలిసి ఇది ఒక ఉన్నతమైన లగ్జరీ స్పా లాంటి అద్భుతమైన అనుభూతిని అతిథులకు అందిస్తుంది.
సులభమైన నిర్వహణ… హోటల్ హౌస్‌కీపింగ్ సిబ్బందికి గాజు గోడలను శుభ్రం చేయడం ఎంతో సులభం. సిమెంట్ గోడలు లేదా టైల్స్‌పై తేమ వల్ల బూజు, జిడ్డు, నీటి మరకలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కానీ గాజుపై ఉండే దుమ్ము, ధూళి వెంటనే కనిపించడంతో సిబ్బంది వాటిని త్వరితగతిన క్లీన్ చేయగలుగుతారు. అంతేకాకుండా చాలామంది బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. గాజు గోడల వల్ల బయటకు కాంతి స్పష్టంగా కనిపించడం వల్ల అతిథులు స్వయంగా లైట్లు ఆఫ్ చేస్తారు.
స్మార్ట్ లేదా ఎలక్ట్రిక్ గ్లాస్: ఒకే ఒక్క స్విచ్ బటన్ నొక్కగానే పారదర్శక గాజు కాస్తా సెకన్ల వ్యవధిలో పూర్తిగా అపారదర్శకంగా (Frosted/Opaque) మారిపోయి లోపల ఉన్నది ఏమీ కనిపించకుండా చేస్తుంది.
కర్టెన్లు , బ్లైండ్స్: కొన్ని హోటళ్లలో బడ్జెట్ పరంగా గాజు గోడల లోపలి వైపు లేదా వెలుపలి వైపు ఆటోమేటిక్ రోలర్ బ్లైండ్స్ లేదా వాటర్‌ప్రూఫ్ కర్టెన్లను ఏర్పాటు చేస్తారు.
ఫ్రాస్టెడ్ డిజైన్: మరికొన్ని హోటళ్లలో నడుము భాగం వరకు కనిపించకుండా ప్రత్యేకమైన ఫ్రాస్టెడ్ స్టిక్కరింగ్ లేదా మిల్కీ గ్లాస్ డిజైన్‌ను అమలు చేస్తారు.
ఇటుక గోడతో పోలిస్తే గాజు పలకలు కేవలం అర అంగుళం మందంతో మాత్రమే ఉండి గదిలో స్థలాన్ని ఆదా చేస్తాయి. అలాగే వీటి నిర్మాణ సమయం, ఖర్చు కూడా కాంక్రీట్ గోడల కంటే తక్కువగా ఉండటం వల్ల ఆధునిక హోటల్ ఇండస్ట్రీలో గాజు బాత్రూమ్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ఆధునిక ఆర్కిటెక్చర్ అధ్యయనాలు, హోటల్ ఇండస్ట్రీ అంతర్జాతీయ నివేదికలు , సాధారణ అవగాహన ఆధారంగా ప్రచురించింది మాత్రమే.
