AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో కొత్త మోడల్స్ లాంచ్!

JBL Partybox Speakers: పార్టీబాక్స్ 330, పార్టీబాక్స్ 130 అనేవి సాధారణ టీవీ సౌండ్‌బార్ కంటే మరింత అధునాతనమైన దాని కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ రెండు స్పీకర్‌లలోనూ ఆప్టికల్ టీవీ పోర్ట్‌లు, USB-C లాస్‌లెస్ ప్లేబ్యాక్, ఓరాకాస్ట్..

JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో కొత్త మోడల్స్ లాంచ్!
Jbl Partybox Speakers
Subhash Goud
|

Updated on: Oct 06, 2026 | 6:03 PM

Share

మ్యూజిక్‌ వినే లవర్స్‌కు జేబీపీ కంపెనీ సరికొత్త పార్టీ బాక్స్‌ స్పీకర్లను తీసుకువచ్చింది. JBL EasySing మైక్‌లతో కూడిన ఆరు కొత్త PartyBox స్పీకర్‌లను JBL భారతదేశంలో విడుదల చేసింది. వీటిలో JBL PartyBox 720, PartyBox 330, PartyBox 130, PartyBox On-The-Go 2 Plus, PartyBox On-The-Go 2, PartyBox Encore 2 Plus ఉన్నాయి. కొనుగోలు చేయడానికి వాటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

JBL పార్టీబాక్స్ సిరీస్ ధర:

జేబీఎల్ పార్టీబాక్స్ 720 స్పీకర్ ధర రూ. 99,999, పార్టీబాక్స్ 330 ధర రూ. 64,999, పార్టీబాక్స్ 130 ధర రూ. 46,999, పార్టీబాక్స్ ఆన్-ది-గో 2 ప్లస్ ధర రూ. 44,999. ఈ ఉత్పత్తులన్నీ ప్రస్తుతం in.jbl.com, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, భారతదేశవ్యాప్తంగా ఉన్న అధీకృత రిటైలర్ల వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

JBL పార్టీబాక్స్ 720 వివరాలు:

JBL పార్టీబాక్స్ 720 స్పీకర్‌లో శక్తివంతమైన 800W RMS సామర్థ్యం ఉంది. దీనిలో రెండు 9-అంగుళాల వూఫర్‌లు, రెండు 30mm డోమ్ ట్వీటర్‌లు ఉన్నాయి. ఈ స్పీకర్ AI సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది వాల్యూమ్ పెరిగే కొద్దీ సౌండ్‌ క్వాలిటీని మెరుగుపరిచి, స్పష్టమైన ధ్వనిని అందిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది వాటర్-రెసిస్టెంట్ ప్రొటెక్షన్ (IPX4) ఫీచర్‌తో వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి చింత లేకుండా మీ సంగీతాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ స్పీకర్‌ను సులభంగా తరలించడానికి వీల్స్‌, మిక్సర్‌లు లేదా గిటార్‌ల కోసం డ్యూయల్ XLR ఇన్‌పుట్‌లు, 15 గంటల వరకు బ్యాటరీ లైఫ్ కూడా ఇందులో ఉన్నాయని కంపెనీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: BSNL బంపర్ ఆఫర్.. అతి తక్కువ రీఛార్జ్‌తో ఇప్పుడు 380 రోజుల వ్యాలిడిటీ.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

JBL పార్టీబాక్స్ 330, పార్టీబాక్స్ హైలైట్:

పార్టీబాక్స్ 330, పార్టీబాక్స్ 130 అనేవి సాధారణ టీవీ సౌండ్‌బార్ కంటే మరింత అధునాతనమైన దాని కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ రెండు స్పీకర్‌లలోనూ ఆప్టికల్ టీవీ పోర్ట్‌లు, USB-C లాస్‌లెస్ ప్లేబ్యాక్, ఓరాకాస్ట్ వైర్‌లెస్ మల్టీ-స్పీకర్ పెయిరింగ్, డ్యూయల్ మైక్ లేదా గిటార్ జాక్‌లు ఉన్నాయి.

పవర్‌ఫుల్‌ 280W సామర్థ్యం గల పెద్ద PartyBox 330లో రెండు 6.5-అంగుళాల వూఫర్‌లు, వెడల్పాటి చక్రాలు, టెలిస్కోపిక్ హ్యాండిల్ ఉన్నాయి. ఇది ఒకే ఛార్జ్‌పై 18 గంటల వరకు ప్లే చేయగలదు. మరోవైపు చిన్న PartyBox 130లో రెండు 5.25-అంగుళాల వూఫర్‌లు, మడతపెట్టగల హ్యాండిల్ ఉన్నాయి. ఇది 15 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తుందని చెబుతున్నారు.

JBL ఆన్-ది-గో 2:

ఆన్-ది-గో 2, ఎన్‌కోర్ 2 ప్లస్ సిరీస్‌లు 100W RMS ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలకు చాలా అనువైనవి. అదనంగా ఆన్-ది-గో 2 AI ప్లస్, ఎన్‌కోర్ 2 ప్లస్‌లు JBL ఈజీసింగ్ మైక్‌తో వస్తాయి. ఇది ఏ సాధారణ పాటకు అయినా AI-ఆధారిత వోకల్ రిమూవల్, పిచ్ కరెక్షన్, సహజమైన రెవెర్బ్‌ను జోడిస్తుంది.  JBL వినియోగదారుల కోసం ఈజీసింగ్ మైక్‌లను రెండు మైక్‌ల సెట్‌గా అందిస్తోంది. ఈ వైర్‌లెస్ మైక్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నాయిస్ రిడక్షన్, ఎకో క్యాన్సిలేషన్, 10 గంటల వరకు బ్యాటరీ లైఫ్, 30 మీటర్ల వరకు ఆపరేటింగ్ రేంజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: DMartకు ఏ రోజు వెళ్తే ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందో తెలుసా? ఈ ట్రిక్ చాలామందికి తెలియదు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us