AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Finance: మిత్రమా..! అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!

Personal Finance: అక్టోబర్‌ 15వ తేదీ వచ్చేందుకు పెద్దగా సమయం లేదు. ఆ తేదీ నుంచి యూపీఐ పేమెంట్‌ చేసే వారికి ఛార్జీలు పడనున్నాయి. అయితే ఈ ఛార్జీలు అందరికి కాదు. కొందరికి మాత్రమేనని గుర్తించుకోండి. చిరు వ్యాపారులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ..

Personal Finance: మిత్రమా..! అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
Upi Charges
Subhash Goud
|

Updated on: Oct 06, 2026 | 6:42 PM

Share

Personal Finance: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 15 నుంచి తన UPI డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తోంది. ఇది కొన్ని UPI చెల్లింపులపై MDR ఫీజులను వసూలు చేయనుంది. చిన్న వ్యాపారులకు MDR ఉండదు. నిత్యావసర సేవల కోసం స్వీకరించే చెల్లింపులపై తక్కువ ఎండీఆర్‌ ఫీజు ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్‌లో చేసే చెల్లింపులపై తక్కువ ఫీజు ఉంటుంది. ఈ విషయంలో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: DMartకు ఏ రోజు వెళ్తే ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందో తెలుసా? ఈ ట్రిక్ చాలామందికి తెలియదు!

వ్యక్తిగత చెల్లింపులకు MDR లేదు..

వ్యక్తి నుండి వ్యక్తికి చేసే UPI చెల్లింపులకు ఈ రుసుము లేదు. ఏ వ్యక్తి అయినా ఏ వ్యాపారికి చెల్లింపు చేసినా MDR రుసుము ఉండదు. అయితే, కేవలం పెద్ద వ్యాపారులు మాత్రమే తాము స్వీకరించే UPI చెల్లింపులకు MDR రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

0.4% MDR ఫీజు, రూ. 300

రూ. 2,000 దాటిన UPI చెల్లింపులపై 0.4% MDR ఫీజు విధిస్తారు. చెల్లింపు రూ. 75,000 దాటితే 0.4%కి బదులుగా రూ. 300 ఫ్లాట్ ఫీజు విధించనున్నారు. ఇక రూ. 1,00,000 దాటిన చెల్లింపులపై కేవలం రూ. 300 మాత్రమే వసూలు చేస్తారు.ఈ ఫీజు నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. చిన్న వ్యాపారులకు ఫీజు లేదు. ఈ ఫీజు కేవలం పెద్ద వ్యాపారుల నుండి మాత్రమే వసూలు చేయనుంది కేంద్రం.

యుటిలిటీ చెల్లింపులకు రూ. 5 ఫ్లాట్ ఫీజు

రైల్వే టిక్కెట్లు, విద్యా బీమా, పెట్రోల్, గ్యాస్, నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు మొదలైన వాటి కోసం చెల్లింపులు స్వీకరించే కార్పొరేషన్లకు, రూ. 2,000 చెల్లింపులపై 0.4% MDRకు బదులుగా రూ. 5 ఫ్లాట్ ఫీజు విధిస్తారు. రూ. 25,000 యుటిలిటీ చెల్లింపులపై కేవలం రూ. 5 MDR మాత్రమే ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ వంటి క్యాపిటల్ మార్కెట్ కోసం 0.02% MDR.

మ్యూచువల్ ఫండ్‌లు, ఇతర సెక్యూరిటీల కోసం రూ. 2,000 దాటిన UPI చెల్లింపులపై 0.02% MDR ఛార్జీ విధిస్తారు. ఇక్కడ కూడా గరిష్ట పరిమితి రూ. 300. రూ. 10,000 చెల్లింపునకు MDR ఛార్జీ 0.02%, అంటే రూ. 2.

చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు ఎవరు?

నెలలో రూ. 1 లక్ష వరకు యూపీఐ చెల్లింపులు అందుకునే వ్యాపారులను చిన్న వ్యాపారులుగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువ చెల్లింపులు అందుకునే వారిని పెద్ద వ్యాపారులుగా పరిగణిస్తారు. ఈ వర్గీకరణను బ్యాంకులు చేస్తాయి. పెద్ద వ్యాపారులు రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు అందుకుంటే వారు 0.4% ఎండీఆర్‌ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10,000 చెల్లింపునకు, రుసుము 0.4%, అంటే రూ. 40 ఉంటుంది.

ఇది కూడా చదవండి: BSNL బంపర్ ఆఫర్.. అతి తక్కువ రీఛార్జ్‌తో ఇప్పుడు 380 రోజుల వ్యాలిడిటీ.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us