AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే ప్రసార హక్కుల విక్రయం..!

Pakistan Cricket: ప్రసార హక్కుల విషయంలో పీసీబీకు తక్కువ ఆదాయం వచ్చింది. 25 అంతర్జాతీయ హోమ్ మ్యాచ్‌ల హక్కులను రూ.600 మిలియన్ల రిజర్వ్ ధరకు బదులుగా రూ.350 మిలియన్లకు పీటీవీ దక్కించుకుంది. బిడ్డింగ్‌లో ఒక సంస్థ మాత్రమే పాల్గొంది. దీంతో పాక్ క్రికెట్‌పై జనాలకే కాదు, బ్రాడ్ కాస్టర్లకు ఆసక్తి లేకుండా పోయింది.

పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే ప్రసార హక్కుల విక్రయం..!
Pcb Forced To Sell Broadcasting Rights
Venkata Chari
|

Updated on: Oct 06, 2026 | 5:29 PM

Share

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు సొంతగడ్డపై జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో ఆశించిన స్థాయి ఆదాయం రాలేదు. 25 అంతర్జాతీయ మ్యాచ్‌ల హోమ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను రిజర్వ్ ధర కంటే చాలా తక్కువ మొత్తానికి పాకిస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్ కార్పొరేషన్ (PTV) దక్కించుకుంది. పీసీబీ నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.600 మిలియన్లు కాగా, పీటీవీ రూ.350 మిలియన్లకు బిడ్ చేసింది. ఈ టెండర్‌లో పీటీవీ మాత్రమే బిడ్ దాఖలు చేయడంతో ఒప్పందం దానికే దక్కింది. కొత్త ఒప్పందంలో ఐదు టెస్టులు, 14 వన్డేలు, ఆరు టీ20లు కలిపి మొత్తం 25 మ్యాచ్‌లు ఉన్నాయి.

మూడు ఫార్మాట్ల మ్యాచ్‌లకు హక్కులు..

ఈ ప్రసార హక్కుల పరిధిలో పాకిస్థాన్‌ స్వదేశంలో ఆడే పలు సిరీస్‌లు ఉన్నాయి. ఈ నెలలో శ్రీలంకతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల ట్రై-సిరీస్‌ వన్డేలు ఉన్నాయి. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి.

అలాగే 2027 జనవరిలో ఐర్లాండ్‌తో మూడు టీ20లు, ఐర్లాండ్‌–జింబాబ్వేతో కలిసి జరిగే ఏడు మ్యాచ్‌ల ట్రై-సిరీస్‌ కూడా ఈ హక్కుల ఒప్పందంలో భాగంగా ఉంది. అయితే జింబాబ్వే తన క్రికెట్ బోర్డుకు సంబంధించిన అంతర్గత సమస్యల కారణంగా పాకిస్థాన్‌ పర్యటనకు రావడం కష్టమని ఇప్పటికే తెలిపినట్లు సమాచారం.

బ్రాడ్‌కాస్టర్ల ఆసక్తి తగ్గడానికి కారణాలేంటి?..

పీసీబీకి గతంలో ప్రసార హక్కులు పొందిన కనీసం మూడు బ్రాడ్‌కాస్టర్లు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో కన్సార్టియంగా హక్కులు పొందిన సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. బకాయిలు ఉన్న సంస్థలను టెండర్‌లో పాల్గొనకుండా నిషేధించకపోయినా, అవి ఈసారి బిడ్డింగ్‌కు దూరంగా ఉన్నాయని సమాచారం.

పాకిస్థాన్ జాతీయ జట్ల ఇటీవలి ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల స్పాన్సర్లు, ప్రకటనదారుల ఆసక్తి కూడా తగ్గిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ ప్రసార హక్కుల విషయంలోనూ పీసీబీకి ఆశించిన స్పందన రాలేదు. గత సీజన్ ప్రసార హక్కులు పొందిన ఓ బ్రాడ్‌కాస్టర్‌ ఇంకా బిలియన్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us