AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ వెస్ట్ ఇండీస్‌తో జరగనున్న టి20 సిరీస్ ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు. గత విజయాలను అలవాటుగా మార్చుకోవడం, జట్టులో సమష్టి కృషి, యువ ఆటగాళ్లకు మద్దతు, వెస్టిండీస్‌పై ధీమా అతని మాటల్లో ప్రధాన అంశాలు. ఆసియా క్రీడల ఆత్మవిశ్వాసంతో సిరీస్ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నాడు.

IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!
Abhishek Sharma Interview
Venkata Chari
|

Updated on: Oct 06, 2026 | 3:38 PM

Share

భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య ఆరువ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదు టి20ల సిరీస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే లక్నోకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆసియా క్రీడల ఫైనల్‌లో పాకిస్తాన్‌పై కేవలం 28 బంతుల్లోనే 60 పరుగులు చేసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్, ఈ టి20 సిరీస్‌లో భారత జట్టుకు ఒక కీలక ఆటగాడిగా మారనున్నాడు. అతని బ్యాట్ నుంచి అలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో జాలువారాయి. క్రీజులో అభిషేక్ ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు ఒక వణుకు మొదలవుతుంది.

వెస్ట్ ఇండీస్‌తో తొలి టి20 మ్యాచ్‌కు ముందు జియో హాట్ స్టార్‌తో మాట్లాడిన అభిషేక్ శర్మ, తమ జట్టు లక్ష్యాలను స్పష్టం చేశాడు. సాధించిన విజయ ఉత్సవాల నుంచి బయటపడి, ఆ విజయాలను ఒక అలవాటుగా మార్చుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అభిషేక్ పేర్కొన్నాడు. కేవలం ఒకసారి గెలిస్తే సరిపోదని, అదే ప్రదర్శనను పదేపదే పునరావృతం చేస్తూ స్థిరమైన విజయాలను సాధించడం అంత సులభం కాదని ఆయన నొక్కిచెప్పాడు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి జట్టులో ప్రతి ఒక్కరూ ఒకరి కోసం ఒకరు రాణించాల్సిన అవసరం ఉందని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టాలనే పట్టుదలతో పనిచేసినప్పుడు, గెలవడం అనేది ఒక అలవాటుగా మారుతుందని డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వ్యాఖ్యానించాడు.

యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడంపైనా అభిషేక్ శర్మ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. జట్టులో వైభవ్ సూర్యవంశి వంటి యువ ప్రతిభావంతులు ఉన్నారని, వైభవ్ చాలా తెలివైన వాడని అభిషేక్ ప్రశంసించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లో రాణిస్తున్న వైభవ్‌కు జట్టు పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చాడు. జట్టులో వైభవ్ ఒత్తిడికి గురి కాకుండా, ప్రశాంతంగా ఆడేలా చూడటం తమ బాధ్యత అని అభిషేక్ పేర్కొన్నాడు. తాము పెద్దన్నలాగా ఎప్పుడూ వైభవ్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. యువతకు సరైన మార్గదర్శనం, మద్దతు లభిస్తే వారు మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని అభిషేక్ స్పష్టం చేశాడు.

ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా జట్టులో వచ్చిన ఆత్మవిశ్వాసం వెస్టిండీస్ సిరీస్‌లో తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిషేక్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఆత్మవిశ్వాసంతో రాబోయే సిరీస్‌లో భారత్ శుభారంభం చేస్తుందని అన్నాడు. టీం వర్క్‌తోనే ఏదైనా సాధ్యమవుతుందని పునరుద్ఘాటించాడు. వెస్టిండీస్ జట్టులో ఎలాంటి హిట్టర్లు ఉన్నా సరే, అంతకు మించి అనేలా తమ ఆట కొనసాగుతుందని, ఈ సిరీస్ ముందు వెస్టిండీస్‌కు ఒక డెడ్ వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా ఆటగాళ్లు ఈ సిరీస్‌ను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నారని, స్థిరమైన ప్రదర్శనతో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారని అభిషేక్ శర్మ మాటల్లో స్పష్టమవుతోంది.

Follow Us