AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకలితో ఉన్న దివ్యాంగ భక్తుడిని చూసి చలించిపోయింది.. గాయత్రీ చేసిన సేవకు సీఎం ఫిదా!

అమరావతి: మానవత్వాన్ని చాటుకున్న ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. రెండు చేతులు లేని దివ్యాంగ భక్తుడికి స్వయంగా అన్నం తినిపించి ఆయన ఆకలి తీర్చిన గాయత్రీ అనే మహిళా సిబ్బంది చూపిన ఆప్యాయత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆకలితో ఉన్న దివ్యాంగ భక్తుడిని చూసి చలించిపోయింది.. గాయత్రీ చేసిన సేవకు సీఎం ఫిదా!
Divyang Devotee
Balaraju Goud
|

Updated on: Oct 06, 2026 | 6:31 PM

Share

అమరావతి: మానవత్వాన్ని చాటుకున్న ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. రెండు చేతులు లేని దివ్యాంగ భక్తుడికి స్వయంగా అన్నం తినిపించి ఆయన ఆకలి తీర్చిన గాయత్రీ అనే మహిళా సిబ్బంది చూపిన ఆప్యాయత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్టోబర్ 3వ తేదీన ద్వారకాతిరుమల ఆలయ అన్నప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతులు లేకపోవడంతో అన్నప్రసాదం తినేందుకు ఇబ్బంది పడుతున్న దివ్యాంగ భక్తుడు సత్యనారాయణను గమనించిన గాయత్రీ.. వెంటనే స్పందించారు. స్వయంగా అన్నం తినిపించి భక్తుడి ఆకలి తీర్చారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో గాయత్రీ సేవాభావాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగ భక్తుడు సత్యనారాయణకు గాయత్రీ అన్నం తినిపిస్తున్న వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో సీఎం పోస్టు చేశారు. “శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల అన్నప్రసాద కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. ‘మానవ సేవే మాధవ సేవ’ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

గాయత్రీ చేసిన సేవపై భక్తులు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి పట్ల మానవత్వంతో వ్యవహరించాలనే సందేశాన్ని ఈ ఘటన చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us