AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 2nd ODI Weather Report: 2వ వన్డేకు వర్షం ఎఫెక్ట్.. అడిలైడ్‌ వెదర్ రిపోర్ట్ ఇదే..?

India vs Australia 2nd ODI: అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డేలో, భారత క్రికెట్‌లోని బలమైన స్తంభాలలో ఇద్దరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి భారత అభిమానులు భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియాపై (IND vs AUS) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొదటి మూడు స్థానాల్లో ఉండటం గమనించదగ్గ విషయం.

IND vs AUS 2nd ODI Weather Report: 2వ వన్డేకు వర్షం ఎఫెక్ట్.. అడిలైడ్‌ వెదర్ రిపోర్ట్ ఇదే..?
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Oct 22, 2025 | 12:53 PM

Share

IND vs AUS 2nd ODI Weather Report: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో వర్షం అభిమానుల ఆనందాన్ని దెబ్బతీసింది. వర్షం కారణంగా ఆట ప్రభావితమైన మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్ణయించారు. చివరికి ఓవర్లను 26 ఓవర్లకు కుదించారు.

అయితే, పెర్త్ లాగా అడిలైడ్ కూడా వర్షంతో కొట్టుకుపోతుందా లేదా పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించగలరా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అక్టోబర్ 23వ తేదీ గురువారం అడిలైడ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.

హై వోల్టేజ్ మ్యాచ్‌లో వర్షం పాత్ర పోషిస్తుందా?

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ ODI (IND vs AUS) అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అడిలైడ్‌కు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే పెర్త్‌లో జరిగినట్లుగా అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా అని అభిమానులు ఇప్పటికీ ఆలోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 23న వర్షం పడే అవకాశం 20 శాతం ఉంది. కాబట్టి అభిమానులు పూర్తి 50 ఓవర్ల ఆటను ఆస్వాదించవచ్చు. ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ (IND vs AUS) ప్రకారం, మ్యాచ్ సమయంలో వర్షం ఉత్సాహాన్ని చెడగొట్టదు.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమ్ ఇండియా, అక్టోబర్ 23వ తేదీ గురువారం ఆస్ట్రేలియన్లతో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు డూ-ఆర్-డై మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే, ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, భారత్ చివరిసారిగా 2019లో ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌ను (IND vs AUS) గెలుచుకుంది.

భారత జట్టు చరిత్రను పునరావృతం చేయాలనుకుంటే, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జట్టుకు ఘోర పరాజయం అందిచాల్సి ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించాలంటే, ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవాలంటే భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండూ సమన్వయంతో రాణించాలి.

రోహిత్-విరాట్‌పై అభిమానుల ఆశలు..

పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు మద్దతుగా భారత అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ, చివరికి భారత్ ఓడిపోయింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ సున్నా పరుగులకే ఔటయ్యాడు.

అయితే, అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డేలో, భారత క్రికెట్‌లోని బలమైన స్తంభాలలో ఇద్దరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి భారత అభిమానులు భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియాపై (IND vs AUS) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొదటి మూడు స్థానాల్లో ఉండటం గమనించదగ్గ విషయం. మరి రెండో వన్డేలో ఏం చేస్తారో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..