IPL 2025: CSKలోకి రిషబ్ పంత్? క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈవో.. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో, రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరే అవకాశంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, CSK సీఈవో విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు, చెన్నైకు 55 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నందున, పంత్‌ను కొనుగోలు చేయడం కష్టమే అని చెప్పారు. అతడిని కొనుగోలు చేయాలనుకుంటున్నాం కానీ పోటీలో గెలిచేందుకు వీలు లేదని వెల్లడించారు. CSK ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, మథీషా పథిరన, శివం దుబే, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసింది.

IPL 2025: CSKలోకి రిషబ్ పంత్? క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈవో.. ఏమన్నాడంటే?
Panth
Follow us
Narsimha

| Edited By: Venkata Chari

Updated on: Nov 10, 2024 | 9:51 PM

ఐపీఎల్ మెగా వేలానికి తేదీ దగ్గర పడుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏ ఆటగాళ్లను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఫ్రాంచైజీలు ఉన్నాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత ఆటగాళ్లు వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురికి కాసుల వర్షం కురిపించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్‌లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ధోనీతో పాటు పంత్ పసుపు జెర్సీని ధరిస్తాడని మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా ఆ మధ్య చెప్పకనే చెప్పాడు. ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత CSKకి శాశ్వత వికెట్ కీపర్ అవసరం. ఆ స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా పంత్ జట్టులో విధ్వంసక బ్యాట్స్‌మెన్ అవుతాడని అంతేకాకుండా కెప్టెన్‌గా జట్టును సమతుల్యం చేస్తాడని.. దీంతో ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో రిషభ్ పంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ గట్టిగా పోటీ పడే అవకాశముందని ఉహాగానలు మొదలయ్యాయి.

అయితే సీఎస్‌కే ఐదుగురిని రిటైన్ చేసుకోగా ఆ ప్రాంచైజీ దగ్గర మిగిలింది 55 కోట్లు మాత్రమే. ఈ సొమ్ముతో 18-19 మంది ఆటగాళ్లను సీఎస్‌కే కొనుగోలు చేయవలసి ఉంటుంది. అయితే మెగా వేలంలో పంత్‌ను కొనుగోలు చేయడంపై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ వద్ద ఉన్న పర్స్ వ్యాల్యూ, ఇతర ఫ్రాంచైజీల నుంచి ఉండే పోటీ దృష్ట్యా పంత్‌ను కొనుగోలు చేయలేమని పేర్కొన్నాడు. అయితే పంత్ కోసం పోటీలోకి వస్తామని, కానీ అతడిని దక్కించుకుంటామని చెప్పలేమని తెలిపాడు.

రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు, మథీషా పథిరన- రూ.13 కోట్లు, శివం దుబే- 12 కోట్లు, రవీంద్ర జడేజా- 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ధోనీని అన్ క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్‌లోకి చేర్చింది. నాలుగు కోట్ల రూపాయలతో అతన్ని రిటైన్ చేసుకుంది సీఎస్కే. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి సీఎస్కే పగ్గాలు చేపట్టన్నాడు అందుకే అతడిని ఫ్రాంచైజీల 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..