IND vs PAK Match: ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. భారత ఓటమిపై ఏమన్నారంటే..

India vs pak match Reactions: భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌లో దయాది జట్టు విజయకేతనాన్ని ఎగుర వేసింది...

IND vs PAK Match: ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. భారత ఓటమిపై ఏమన్నారంటే..
Ind Vs Pak Match Reactions
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2021 | 12:28 AM

India vs pak match Reactions: భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌లో దాయాది జట్టు విజయకేతనాన్ని ఎగుర వేసింది. వార్‌ వన్‌ సైడ్‌ అయ్యిందన్నట్లు పాకిస్థాన్‌ చెలరేగింది. ఓ వైపు బౌలింగ్‌లో భారత్‌ను తక్కువ పరుగులకు కట్టడి చేయడమే కాకుండా.. లక్ష్యాన్ని చాలా సులువుగా చేధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోని సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక భారత్‌ ఘోరపరాజయంపై క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే తమ ఆవేదనను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. భారత్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఆవేదనను పంచుకున్నారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన భారత్‌ ఓటమి బాధ కలిగించిందని తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘ఫలితం ఆశించినట్లు రాలేదు. వేరే జట్లతో ఓడిపోతే పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు కానీ.. పాకిస్థాన్‌తో ఓడిపోవడం చాలా బాధకరం. చాలా రోజుల నుంచి సోషల్‌ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో భారత్‌ తప్పకుండా గెలుస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చాలా సులభంగా విజయాన్ని అందుకుంది.

భారత్‌ ఓడిపోవడానికి కరోనా కూడా ఒక కారణమై ఉండొచ్చు. 4 నెలలపాటు మన టీమ్‌ ఐసోలేషన్‌లో ఉంది. అంతేకాకుండా కొందరు ప్లేయర్స్‌ గాయాలతో బాధపడ్డారు. ఇవన్నీ ఓటమికి కారణమై ఉండొచ్చు. అయితే ఇండియా పోడుతుందని అస్సలు అనుకోలేదు. ఇది ఊహించని పరాజయం’ చెప్పుకొచ్చారు.

Also Read: Malvika Sharma: మత్తెక్కిస్తున్న మాళవిక ఫోజులు.. మైమరచి పోతున్న కుర్రకారు

IND vs PAK Match Twitter: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెటిజన్లు ఏమంటున్నారు.. ట్విట్టర్‌ రియాక్షన్స్‌పై ఓ లుక్కేయండి..

Viral Video: వామ్మో..ఈ పెళ్లికూతురు స్పీడు మామూలుగా లేదు.. వీడియో