INDIA vs PAK Match: ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్ చివరిదైతే కాదు కదా అంటూ..
INDIA vs PAK Match Reactions: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యార్థి పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే...
INDIA vs PAK Match Reactions: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యార్థి పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో భారత్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. 10 వికెట్ల తేడాతో భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించి పాకిస్థాన్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఇదిలా ఉంటే మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ జట్టు ఈ రోజు ఆడిన విధానం బాగుంది. మొదట బంతితో శుభారంభించారు. మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లోకి వెళ్లాము. మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయాం. తొలుత నెమ్మదిగా మొదలుపెట్టి.. తిరిగి పుంజుకోవడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఇంకో 20 పరుగులు అదనంగా వచ్చి ఉంటే బాగుండేది. కానీ పాకిస్థాన్ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు.
పాకిస్థాన్‌ను ఆరంభంలోనే వికెట్లు తీయాల్సింది కానీ వాళ్లు మంచి బ్యాటింగ్ తీరును కనబరిచారు. అయితే, మా బలాబలాలేమిటో మాకు తెలుసు. స్లో బౌలర్ లేకపోవడం లోటు అనడానికి అంతగా ఆస్కారం లేదు. డ్యూ ఉన్నపుడు వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేరు. అయినా టోర్నమెంట్‌లో ఇది మొదటి మ్యాచ్… చివరిదైతే కాదు కదా’ అని చెప్పుకొచ్చాడు. ఇలా కోహ్లీ ఓటమిని హుందాగా ఒప్పుకుంటూనే భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌ల్లో రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..