India vs Pakistan: 15 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన బీసీసీఐ బృందం.. ఆ మ్యాచ్ కోసం ముఖ్య అతిథులుగా..
India vs Pakistan: ఈ ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించడానికి బీసీసీఐ ప్రధాన కారణం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఆసియా కప్‌లో అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో నిర్వహిస్తే.. భారత జట్టు పాల్గొనదని బీసీసీఐ తెలిపింది. ఆ విధంగా శ్రీలంక, పాకిస్థాన్‌లలో ఆసియా కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

India vs Pakistan: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సోమవారం (సెప్టెంబర్ 4) పాకిస్థాన్ బయల్దేరి వెళ్లారు. ఆసియా కప్ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు బీసీసీఐ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ పాకిస్థాన్‌లో పర్యటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు అట్టారీ-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌కు వెళ్లారు. బీసీసీఐ ప్రెసిడెంట్-వైస్ ప్రెసిడెంట్‌కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ జాకా అష్రాఫ్ స్వాగతం పలికారు.
ఈ ప్రయాణానికి ముందు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. రెండు రోజుల పాకిస్థాన్ పర్యటన కేవలం క్రికెట్ ప్రయోజనాల కోసమేనని అన్నారు. ఇక్కడ ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని అన్నారు.
2006 తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌కు వెళ్తున్నాను అంటూ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్‌లు చూసేందుకు కొలంబో వెళ్లాం. అదే విధంగా పాకిస్థాన్‌ను సందర్శిస్తున్నట్లు తెలిపారు.
15 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌కు..
2008లో భారత్‌పై పాక్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత టీం ఇండియా పాక్‌లో ఎలాంటి సిరీస్‌లు ఆడలేదు. అంతే కాకుండా 2008 నుంచి ఇప్పటి వరకు బీసీసీఐ అధికారి ఎవరూ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. 15 ఏళ్ల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్‌లో పర్యటించారు.
ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా..
#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla crossed the Attari–Wagah border to visit Pakistan for Asia Cup 2023 pic.twitter.com/oEot70doAq
— ANI (@ANI) September 4, 2023
సెప్టెంబర్ 5న లాహోర్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గడ్డాఫీ స్టేడియంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
15 ఏళ్ల తర్వాత ఆసియా కప్..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ను నిర్వహిస్తోంది. కాగా, క్రికెట్ బోర్డు అధికారులందరికీ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆగస్టు 30న ముల్తాన్‌లో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్ హాజరవుతారని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే కొన్ని కారణాల వల్ల రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా పాకిస్థాన్ వెళ్లలేదు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్‌ను సందర్శించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ఆహ్వానాన్ని గౌరవించి, వెళ్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




