MS Dhoni: ఇదికదా సార్ ధోని అంటే..! అందుకోసం ఏకంగా కోట్లు వదులుకున్నాడు: కోహ్లీ
మహేంద్ర సింగ్ ధోని.. మైదానం లోపలే కాదు.. వెలుపల కూడా అద్భుతమైన వ్యక్తి అని చెప్పొచ్చు. తన ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల కోసం అతడు చేసిన ఎన్నో పనులు ప్రశంసించదగ్గవి ఎన్నో ఉన్నాయి. ఇటీవల తన మిత్రుడి కోసం ధోని చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మహేంద్ర సింగ్ ధోని.. మైదానం లోపలే కాదు.. వెలుపల కూడా అద్భుతమైన వ్యక్తి అని చెప్పొచ్చు. తన ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల కోసం అతడు చేసిన ఎన్నో పనులు ప్రశంసించదగ్గవి ఎన్నో ఉన్నాయి. ఇటీవల తన మిత్రుడి కోసం ధోని చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ధోని స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్.. అతడికి రాంచీలో ప్రైమ్ స్పోర్ట్స్ పేరిట ఓ షాపు ఉంది. తన కెరీర్ ఆరంభంలో పరమ్‌జిత్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ధోని.. ఇటీవల అతడి షాప్ స్టిక్కర్‌తో కూడిన బ్యాట్‌తో ప్రాక్టిస్ చేస్తూ కనిపించాడు. ఇంకేముంది అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.
ఎందుకు ధోని ఇదంతా చేశాడో తెలుసుకున్న నెటిజన్లు మహి భాయ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇదొక్కటే కాదు సర్.. గతంలోనూ ధోని ఓ మంచి పని చేసి.. తన గొప్ప మనసు చాటుకున్నాడు. 2019 ప్రపంచకప్ సమయంలో ధోని ‘BAS’ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌తో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఇలా ఓ సంస్థకు ధోని ప్రచారకర్తగా ఉంటే.. కచ్చితంగా కోట్లు వచ్చిపడతాయి. అయితే ఇందుకు గానూ ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
బీఏఎస్.. బీట్ ఆల్ స్పోర్ట్స్ యజమాని సోమి కోహ్లీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ధోని కెరీర్ ఆరంభంలో ఓ క్రికెట్ కిట్ ఉచితంగా అందించి.. ప్రోత్సహించాను. దానికి కృతజ్ఞతగా 2019 ప్రపంచకప్‌లో బీఏఎస్ స్టిక్కర్ బ్యాట్‌తో కొన్ని మ్యాచ్‌లలో కనిపించాడు ధోని. టోర్నీ ఆరంభానికి ముందు.. కొన్ని బ్యాట్లకు బీఏఎస్ స్టిక్కర్లు వేసి పంపమని ధోని కోరాడు. ఆ మాటకు షాకైన నేను.. అతడికి కొంత డబ్బు ఆఫర్ చేశాను. అంత పెద్ద టోర్నీలో వేరే కంపెనీల పేరుతో బ్యాట్లు వాడితే.. ధోనికి కోట్లు వచ్చిపడతాయి. అతడు అలా ఏం చేయలేదు. నా కంపెనీ స్టిక్కర్లు ఉపయోగించాడు. డబ్బులిచ్చినా తీసుకోలేదు. ధోని భార్య సాక్షి, అతడి ఫ్రెండ్స్, తల్లిదండ్రులకు కూడా ధోనికి నచ్చజెప్పమని చెప్పాను. అయినా ధోని వారి మాట కూడా వినలేదు’ అని కోహ్లీ అన్నారు. ఇది విన్నాక నెటిజన్లు.. ‘సార్.. ఇది మా ధోని గొప్పతనం’ అంటూ కామెంట్స్‌తో హోరెత్తించారు.
— Sanju Here 🤞| Alter EGO| (@me_sanjureddy) February 14, 2024




