IPL 2023: చెన్నై టీంను నిషేధించండి.. తమిళనాడు అసెంబ్లీలో పీఎంకే డిమాండ్.. ఎందుకంటే?
Chennai Super Kings: చెన్నై టీంలో తమిళనాడుకి చెందిన ఒక్క ఆటగాడు లేకపోవడం దారుణమని, తమిళనాడు క్రీడాశాఖ దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు.
తమిళులు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని బమాక ఎమ్మెల్యే తమిళనాడు శాసనసభను కోరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీంని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో రగడ మొదలైంది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో పీఎంకే పార్టీ డిమాండ్ చేసింది.
ఈరోజు తమిళనాడు శాసనసభలో ఆ రాష్ట్ర క్రీడా శాఖపై చర్చలు జరిగాయి. అందులో బామగకు చెందిన ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు జట్టుగా ప్రచారం చేస్తూ ప్రజల నుంచి లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. చెన్నై టీంలో తమిళనాడుకి చెందిన ఒక్క ఆటగాడు లేకపోవడం దారుణమని, తమిళనాడు క్రీడాశాఖ దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు.
తమిళనాడులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదని, తమిళులు లేకుండా తమిళనాడు జట్టు అంటూ ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వాళ్ల లాభం కోసమే ఇలా చేస్తున్నారంటూ బామాక ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ అన్నారు. అలాగే తమిళులు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించాలని శాసనసభలో పట్టుబట్టారు.
ఒక తమిళ ఆటగాడు లేని టీం మనకెందుకని, చెన్నై టీం ఆటల పేరుతో వ్యాపార లాభాల కోసం మాత్రమే పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెన్నై టీంపై చర్యలు తీసుకోవాలని పీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..