AUS vs IND: పెర్త్ టెస్ట్ మూడో రోజు ఆట పూర్తి.. ఆసీస్‌పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టుబిగించింది. ప్రస్తుతం మన బౌలర్లు జోరు చూస్తుంటే ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఇక లాంఛనమే అని చెప్పుకోవచ్చు. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ అప్పుడే కీలక వికెట్లు కోల్పోయింది.

AUS vs IND: పెర్త్ టెస్ట్ మూడో రోజు ఆట పూర్తి.. ఆసీస్‌పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
India Vs Australia
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 3:52 PM

పెర్త్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత్ విజయానికి 7 వికెట్ల దూరంలో ఉంది. ఆస్ట్రేలియాకు భారత్ 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా తొలి ఓవర్‌లో నాలుగో బంతికి మెక్‌స్వినీ (0)ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత నైట్ వాచ్ మెన్ గా బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక బుమ్రా వేసిన 4.2 ఓవర్‌ బంతికి మార్నస్ లబుషేన్ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో వెంటనే మూడో రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. ఈ మ్యాచ్ లో ఇంకా రెండు రోజుల ఆట ఉంది. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 522 పరుగులు చేయాలి. అదే సమయంలో టీమిండియా విజయానికి 7 వికెట్లు కావాలి. అంతకు ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగా, ఆసీస్‌ 104 రన్స్ కే ఆలౌట్‌ అయింది.

కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

కాగా రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పాట్ కమిన్స్‌ విరాట్ కోహ్లీ కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో సచిన్ 115 క్యాచ్‌లు పట్టాడు. విరాట్‌ పేరిట 116 క్యాచ్‌లు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్ 210 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-XI ఇలా..

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.