రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర క్రికెటర్..! ఆ రెండు మ్యాచ్‌ల తర్వాత గుడ్ బై..
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 2012, 2016 టీ20 ప్రపంచ కప్ విజయాలలో కీలక పాత్ర పోషించిన రస్సెల్ రిటైర్మెంట్ వెస్టిండీస్‌కు భారీ నష్టం.

ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టు తన 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ స్క్వౌడ్‌లో విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ పేరు కూడా ఉండటంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఇదే సిరీస్ మధ్యలో ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.
తన సొంత మైదానం జమైకాలోని సబీనా పార్క్‌లో జరగనున్న మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. రస్సెల్ 2019 నుండి 84 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫిబ్రవరి 2026లో ఇండియా, శ్రీలంకలో జరగనున్న తదుపరి టీ20 ప్రపంచ కప్‌కు ఏడు నెలల ముందు అతను ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను కాస్త షాక్ గురించి చేసింది. అతని రిటైర్మెంట్ వెస్టిండీస్‌కు పెద్ద దెబ్బగా భావించవచ్చు. అంతకుముందు నికోలస్ పూరన్ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
నిజానికి రస్సెల్ 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని అనుకున్నాడు, కానీ సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆండ్రీ రస్సెల్ వెస్టిండీస్ తరపున టీ20 ప్రపంచ కప్‌లను గెలిచాడు. 2012, 2016 టీ20 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న వెస్టిండీస్ జట్టులో రస్సెల్ భాగంగా ఉన్నాడు. అతను వెస్టిండీస్ తరపున మొత్తం 1 టెస్ట్ , 56 ODIలు, 84 T20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్‌లలో 2 పరుగులు చేసి 1 వికెట్ తీసుకున్నాడు. ODI లలో 1034 పరుగులు, 70 వికెట్లు తన పేరిట ఉన్నాయి. టీ20లో 1078 పరుగులు 61 వికెట్లు పడగొట్టాడు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




