నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.! భారత్‌లో 3 టెస్టుల సిరీస్.. కానీ ఆడేది టీమిండియా కాదు

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్. కెప్టెన్ రషీద్ ఖాన్ నేతృత్వంలో ఆఫ్ఘన్ జట్టు మరో 2 నెలల్లో భారత్‌లో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. ఆఫ్ఘన్ ఆడేది టీమిండియాతో కాదు.. మరి ఎవరితో ఆడుతుందన్నదే మీ డౌట్ కదా..

నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.! భారత్‌లో 3 టెస్టుల సిరీస్.. కానీ ఆడేది టీమిండియా కాదు
Cricket
Follow us

|

Updated on: Jul 24, 2024 | 12:10 PM

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్. కెప్టెన్ రషీద్ ఖాన్ నేతృత్వంలో ఆఫ్ఘన్ జట్టు మరో 2 నెలల్లో భారత్‌లో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. ఆఫ్ఘన్ ఆడేది టీమిండియాతో కాదు.. మరి ఎవరితో ఆడుతుందన్నదే మీ డౌట్ కదా.. అయితే ఈ వార్త చదివేయండి.

సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడబోయే 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ వేదికలు ఖరారు చేసింది. గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నోలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ క్రికెట్ స్టేడియాలు వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌ ఈ టెస్టు సిరీస్‌లో తలబడనున్నాయి. ఇక క్రికెట్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

ఇవి కూడా చదవండి

గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం..

అఫ్గానిస్థాన్ జట్టుకు భారత్ మరోసారి అండగా నిలిచింది. ఇంతకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు గ్రేటర్ నోయిడాలో తన హోమ్ సిరీస్‌ను ఆడింది. బీసీసీఐ 2015లో ఆఫ్ఘనిస్థాన్‌కు ఈ వేదికను కేటాయించింది. వాస్తవానికి జూలైలో ఆఫ్ఘనిస్తాన్ గ్రేటర్ నోయిడా వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ ఫ్లాప్ షో..

కివీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టును సైతం ఓడించింది ఆఫ్ఘనిస్తాన్. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 84 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..